మరణం చెప్పిన పాఠం

16 Feb, 2015 04:20 IST|Sakshi
మరణం చెప్పిన పాఠం

చదువు చెప్పిన గురువు, కనిపించని దేవుడికన్నా ‘కని పెంచిన’ తల్లిదండ్రులే మిన్న. తాము కొవ్వొత్తిలా కరిగిపోతూ తమ పిల్లల జీవితాలకు వెలుగులు పంచిన ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఆసరా కరువై తల్లడిల్లుతున్నారు. కన్నవారికి పిడికెడు మెతుకులు పెట్టడానికి మనసొప్పని కొడుకులను ఏమనాలి? అందరూ ఉన్నా అనాథలు కావడానికి కారణమైన సంతానాన్ని ఏమని నిందించాలి ? తిండిపెట్టకున్నా, ఆసరా ఇవ్వకున్నా ఆస్తులు పంచుకుని గెంటేసేవారిని ఎలా శిక్షించాలి??
 
కామారెడ్డి : తమను నిర్లక్ష్యం చేసిన కొడుకులు నలుగురిలో పలుచన కావడానికి మాత్రం ఆ తల్లిదండ్రులు ఒప్పుకోరు. అందుకే కొందరు చావును వెతుక్కుంటున్నారు. ఇటీవల వెలుగు చూసిన బాలయ్య బలవన్మరణం సమాజం ముందు అనేక ప్రశ్నల  ను ఉంచింది. మానవత్వమా నువ్వెక్కడున్నావని ప్రశ్నిస్తోంది. లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన రేవూరి బాలయ్య (78) కొడుకులు పట్టించుకోకపోవడం, పైగా ఇంటి నుంచి గెంటేయడంతో మానసిక క్షోభకు గురై శుభ ముహూర్తాన్ని చూసుకుని మరీ ఉరి వేసుకున్నాడు.

లోకం విడిచి వెళ్లేముందు, తన చావైనా మంచి ముహూర్తంలో జరగాలని శుభ ఘడియలు చూసుకుని చనిపోతున్నానని, అందరూ క్షమించాలని మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. చనిపోయే సమయంలోనూ తన సంతానాన్ని నిందించకుండా, వారిపై ప్రేమనే చూపాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని రాసుకున్నాడు. ఈ కోవలో బాలయ్య బలవన్మరణం మొదటిదీ కాదు, చివరిదీ కాదు. బాలయ్యలాంటి తల్లి,తండ్రులెందరో ఉన్నారు.

పిల్లలు పట్టించుకోని పరిస్థితులలో మానసిక క్షోభకు గురై మంచం పడుతూ కన్నుమూసేవారు కొందరైతే, ఎవరికీ భారం కావద్దని ఆత్మహత్యలకు పాల్పడేవారు మరికొందరు. కొందరు ఉన్నత కుటుంబాలవారైతే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలలో చేర్పించి చేతు   లు దులుపుకుంటున్నారు. కన్నవారి ఆలనా, పాలనా పట్టించుకోక, ఇలాంటి సంఘటనలు సమాజానికి మచ్చ తెస్తున్నా ఆ వైపు ఆలోచనలు చేయడం లేదు. దీంతో ఇవి ఎప్పటికప్పుడు పునరావృత్తమవుతున్నాయి.
 
ఖర్చులు చెల్లిస్తే సరా!
కొందరు తమ తల్లిదండ్రులను వృద్ధుల ఆశ్రమాలలో చేర్పించి, యేడాదికి అయ్యే ఖర్చులను చెల్లించి చేతులు దులుపుకుంటుంటుంటే, మరికొందరు తల్లిదండ్రులను రోడ్డున వదిలేస్తున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను కొట్లాడి పంచుకునే కొడుకులు వారి ఆలనాపాలనా విషయానికి వచ్చేసరికి మాత్రం పెద్దోడు అంటే చి న్నోడు, చిన్నోడంటే పెద్దోడంటూ కొట్లాటలకు దిగుతూ ఇద్దరూ చేతులెత్తేస్తున్నారు. ఒక్క కొడుకు ఉన్న తల్లిదండ్రులు సైతం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు.

ఆశ్రమాలలో చేరేవారిలో చాలా మంది తమకు పిల్లలున్నా, వారు పట్టించుకోకపోవడంతోనే ఇక్కడికి వచ్చామని చెబుతున్నారు. మలిసంధ్యలో ఆసరా ఇవ్వని సంతా నా  న్ని మాత్రం ఏమీ అనలేకపోతున్నారు. మానవ సంబంధాలు డబ్బు సంబంధాలుగా మారిపోతూ సమాజంలో నైతిక విలువలు పతనం అవుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉనికిని కోల్పోవడంతో ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అనుబంధా లు, ఆప్యాయతలు, ప్రేమానురాగాలు అనేవి లేకుండాపోయి బాధ్యతలు కూడా మరిచిపోతున్నారు. త ల్లిదండ్రులకు ఆసరా ఇవ్వాల్సిన కొడుకులు వారి యోగక్షేమా  లు చూడాల్సిన బాధ్యత తమది కాదన్నట్టుగానే వ్య వహరిస్తున్నారు. దీంతో పండుటాకులకు యాతన తప్పడం లేదు. మలి సంధ్య వేళ వారికి ఇది ఆం దోళన కలిగిస్తోంది.

మరిన్ని వార్తలు