రుణ లబ్ధిదారుల జాబితా

1 Mar, 2016 02:33 IST|Sakshi
రుణ లబ్ధిదారుల జాబితా

పూర్తయిన ఎస్సీ రుణాలు
కొలిక్కిరాని బీసీ రుణాల జాబితా
1:4తో బ్యాంకర్లకు బీసీ జాబితా అందజేత

 
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఎస్సీ కార్పొరేషన్ రుణలబ్ధిదారుల జాబితాను ప్రకటించారు. బీసీ రుణాల కోసం తీవ్ర పోటీ ఉండడంతో 1:4 ప్రాతిపదికన బ్యాంకులకు లిస్టును అందించారు.   జనవరి 20, 21 తేదీల్లో నగరపాలక సంస్థలో లబ్ధిదారుల ఎంపికకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ల అధికారులు, బ్యాంకర్లతో ఇంటర్వ్యూలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూలు పూర్తరుు 40 రోజుల తర్వాత లబ్ధిదారుల జాబితాను ప్రకటించారు. 608 యూనిట్లకు 764 దరఖాస్తులు రాగా.. బీసీ రుణాలకు 106 యూనిట్లకు 1184 దరఖాస్తులు వచ్చాయి.

పెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడంతో ఎంపిక ప్రక్రియ కత్తిమీద సాములా మారింది.  1:4 జాబితాను తయారు చేసి ప్రదర్శనకు పెట్టడంతో గందరగోళం నెలకొంది. తుది నిర్ణయంపై సందిగ్ధం ఏర్పడింది. బ్యాంకు కాన్సెంట్లతో సంబంధం లేదని చెప్పిన అధికారులు మార్కులు పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. నగరంలోని అన్ని బ్యాంకులకు రుణాల మంజూరు లక్ష్యం నిర్ణరుుంచగా.. 11 బ్యాంకుల పరిధిలో ఒక్క దరఖాస్తు రాలేదు. ఆయా బ్యాంకుల టార్గెట్లను ఎలా భర్తీ చేయాలనేది ప్రశ్నగానే మిగిలింది.
 
 లబ్ధిదారుల్లో కార్పొరేటర్లు
 రుణాల ఎంపికలో రాజకీయ జోక్యం జోరుగా నడిచినట్లు తెలుస్తోంది. జాప్యానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని తేటతెల్లమైంది. ఎస్సీ రుణాల లబ్ధిదారుల జాబితాలో ఇద్దరు కార్పొరేటర్లు ఉండడమే ఇందుకు నిదర్శనం. ఐదో డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ రూ.8 లక్షలు, ఏడో డివిజన్ కార్పొరేటర్ లింగంపల్లి శ్రీనివాస్ సతీమణి మాజీ కార్పొరేటర్ లింగంపల్లి సుజాత రూ.10 లక్షల రుణానికి ఎంపికయ్యారు.

మరిన్ని వార్తలు