రిజిస్ట్రేషన్ల శాఖలో ‘కొత్త’ నెట్‌వర్క్‌

26 Jul, 2017 02:17 IST|Sakshi

అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఏటా కోటిన్నర ఖర్చు
సాక్షి, హైదరాబాద్‌: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త హంగులను సమకూర్చుకుంటోంది. రిజిస్ట్రేషన్‌ లావాదేవీల్లో తరచూ ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించడం కోసం తన పోర్టల్‌ను స్టేట్‌ వైడ్‌ ఏరియా నెట్‌వర్క్‌ (స్వాన్‌) నుంచి మల్టీప్రోటోకాల్‌ లేబుల్‌ స్విచ్చింగ్‌ (ఎంపీఎల్‌ఎస్‌)లోకి మార్చుకుం టోంది. రెయిల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా ఈ ఎంపీఎల్‌ఎస్‌ సేవలను వినియోగించుకునేందుకు అనుమతినిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్‌.మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందుకోసం వన్‌టైమ్‌ చార్జీల కింద రూ.35.25 లక్షలు, ఏటా సర్వీసు చార్జీల కింద 1.58 కోట్లు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఈ ఉత్తర్వుల్లో కల్పించారు. వాస్తవానికి, ప్రస్తుతమున్న నెట్‌వర్క్‌ ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటకల్లో విజయవంతంగా అమలవుతున్న ఎంపీఎల్‌ఎస్‌ వీపీఎన్‌ నెట్‌వర్క్‌ వైపు మొగ్గుచూపామని ఆ శాఖ డీఐజీ ఎం. శ్రీనివాసులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు