వ్యక్తి అనుమానాస్పద మృతి

10 Mar, 2016 10:59 IST|Sakshi

వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొటాల్‌పల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. రోడ్డు పక్కన మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు వేగవంతం చేశారు. మృతుడు కామారెడ్డికి చెందిన చత్రబోయిన గంగాధర్(33)గా గుర్తించారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న గంగాధర్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు