రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తాం

12 Aug, 2014 00:55 IST|Sakshi
రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తాం

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గౌతం అదానీ భేటీ
 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తామని అదానీ గ్రూపు కంపెనీల చైర్మన్ గౌతం అదానీ ప్రకటించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో ఆయన సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు. 2020 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని, రాష్ట్ర అవసరాలకు సరిపడే విధంగా సరఫరా చేస్తామని అదానీ వివరిం చారు. తవు కంపెనీ ప్రొఫైల్, చేపడుతున్న కార్యక్రమాలను సీఎంకు వివరించారు. సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులు ఇచ్చే విధం గా నూతన పారిశ్రామిక విధానం తయూరు చేస్తున్నామని కేసీఆర్ అదానీకి తెలిపారు. ఇప్పటికే పరిశ్రమలకు ఇచ్చేందుకు భూమిని గుర్తిం చామన్నారు.

అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన భూమినే పరిశ్రమలకు కేటాయిస్తామని సీఎం వివరించారు.  విద్యుత్ సరఫరా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన అదానీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  రాష్ట్ర ప్రభు త్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్శింగరావు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కోకాకోలా యూనిట్.. సీఎంతో కంపెనీ ప్రతినిధుల భేటీ

రాష్ర్టంలో బాట్లింగ్, ఫ్రూట్ జ్యూస్ తయారీ యూనిట్ ఏర్పాటుకు కోకాకోలా కంపెనీ ముం దుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కంపెనీ ప్రతిపాదనకు సువుుఖత వ్యక్తం చేసినట్లు సవూచారం. ఈ అంశంపై చర్చించేందుకు కం పెనీ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ ఇరియల్ ఫినన్, రీజనల్ హెడ్ టి.కృష్ణ కుమార్‌లు సోవువారం సచివాలయుంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో బాట్లింగ్, ఫ్రూట్ జ్యూస్, పాల ఉత్పత్తులతో తయారు చేసే కేకులు మొదలైన యూనిట్లను ఏర్పాటు చేస్తామని సీఎంకు వివరించారు. ఇందుకోసం 50 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కాగా, బాట్లింగ్ యూనిట్‌కు భూగ ర్భ జలాల వినియోగంపె నిషేధం ఉన్న నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వరకు వేయనున్న గోదావరి పైపులైన్ నుంచి నీటిని కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్ధతను తెలిపినట్టు సమాచారం.

ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వరకు వేయనున్న గోదావరి పైపులైను పరిసరాల్లో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కంపెనీకి భూమిని కేటాయించాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిసింది. కాగా, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో ఒక చోట ఈ యూనిట్ ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి.
 
 

మరిన్ని వార్తలు