రుణమాఫీపై అధ్యయనానికి పంజాబ్‌ బృందం

5 Aug, 2017 05:09 IST|Sakshi
రుణమాఫీపై అధ్యయనానికి పంజాబ్‌ బృందం

అవకతవకలు లేకుండా అమలు చేయడంపై అభినందన
సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణమాఫీ పథకంపై అధ్యయనం చేయడానికి పంజాబ్‌ ప్రభుత్వ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. పంజాబ్‌ వ్యవసాయ సహకార విభాగం అద నపు ముఖ్య కార్యదర్శి డి.పి.రెడ్డి, ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ బల్వీందర్‌సింగ్‌ సింధు, సహకార బ్యాంకు ఎండీ ఎస్‌.కె.బటీష్, పంజాబ్‌ వ్యవసాయ వర్సిటీ ఆర్థికవేత్త డాక్టర్‌ సుఖ్‌పాల్‌సింగ్‌ ఈ బృందంలో ఉన్నారు.

వారితో రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి నేతృత్వంలో అధికారులు, వివిధ బ్యాంకర్లు శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. పార్థసారథి రుణమాఫీ గురించి వివరించారు. సీఎం కేసీఆర్‌ రైతు రుణమాఫీ కోసం ఒక కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఆ కమిటీ రెండు నెలలపాటు శ్రమించి అవసరమైన మార్గద ర్శకాలను రూపొందించిందని చెప్పారు. అవకతవకలకు అవకాశం లేకుండా జరిగిన రైతు రుణమాఫీ పథకాన్ని పంజాబ్‌ బృందం అభినందించింది.

మరిన్ని వార్తలు