ఉభయ రాష్ట్రాలకూ ఒకే ‘ఐటీ’ బాస్

18 Nov, 2014 02:49 IST|Sakshi
  • కొత్త పోస్టును సృష్టించిన కేంద్ర ప్రభుత్వం
  •  విజయవాడకు కొత్తగా ఐటీ చీఫ్ కమిషనర్ పోస్టు
  • సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను శాఖ పునర్వ్య వస్థీకరణలో భాగంగా కేంద్రం పలు కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఇందులోభాగంగా ఉభయ తెలుగురాష్ట్రాలకు కలిపి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్‌టాక్స్ పోస్టును హైదరాబాద్‌కు కేటాయించారు. ఇది కేంద్రప్రభుత్వ ప్ర త్యేక కార్యదర్శి హోదాకు సమానం. రెండు రాష్ట్రాల్లోని ఐటీశాఖ కేడర్‌ను ఈ పోస్టులో ఉండే అధికారే నియంత్రిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలులో, తెలంగాణకు హైదరాబాద్‌లో కొత్త గా అసెస్‌మెంట్ కమిషనర్ బాధ్యతలను చూసే పోస్టులను ఏర్పాటు చేశారు.

    రాష్ర్ట విభజన నేపథ్యంలో ఏపీ కోసం విజయవాడలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్‌టాక్స్ పోస్టును సృష్టించారు. ఇప్పటికే విశాఖలో ఓ చీఫ్‌కమిషనర్ పోస్టు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్యాలయం పరిధిలోకే ఏపీలోని అన్నిప్రాంతాలు వస్తాయి. కాగా, అప్పీళ్లను పరిశీలించి వేగంగా పరిష్కరించడానికి వీలుగా 11 అప్పీలెట్ కమిషనర్ పోస్టులు కూడా మంజూరయ్యాయి. వీటిలో ఐదింటిని హైదరాబాద్‌కు కేటాయించారు.

    ఈ మార్పులన్నీ ఈ నెల 15 నుంచే అమల్లోకి వస్తాయని ఐటీ శాఖ సోమవారం ఓప్రకటన విడుదల చేసింది. మరి న్ని వివరాలనుశాఖ వెబ్‌సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్‌కమ్‌టాక్స్.ఓఆర్‌జీ)లో చూడవచ్చు.
     

>
మరిన్ని వార్తలు