‘మిషన్ కాకతీయ’ను సక్సెస్ చేద్దాం

7 Apr, 2016 05:37 IST|Sakshi
‘మిషన్ కాకతీయ’ను సక్సెస్ చేద్దాం

 భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
 
మాడ్గుల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సక్సెస్ చేయాలని, కాంట్రాక్టర్లతో రాజీ పడితే చర్యలు తప్పవని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. మాడ్గుల మండలం నర్సాయిపల్లి పీకలకుంట చెరువు, గిరికొత్తపల్లి తుమ్మలకుంట చెరువుల్లో చేపట్టిన రెండోవిడత మిషన్‌కాకతీయ పనులను మంత్రి బుధవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మొ దటి విడతలో మంజూరైన చెరువుల్లో జరిగిన పనుల నా ణ్యత, చెల్లించిన నిధులు, సర్వేకు చేసిన ఖర్చుల వివరాలను మైనర్ ఇరిగేషన్ డీఈఈ శంకర్‌బాబును అడుగగా ఆ యన పొంతనలేని సమాధానం చెప్పడంతో మండిపడ్డారు.

అవగాహన లేకుండా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. మొదటి విడత మిషన్‌కాకతీయలో మంజూరైన చెరువులకు సంబంధించిన ఎంబీ రికార్డులను తీసుకుని హైదరాబాద్‌కు రావాలని మంత్రి మైనర్‌ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కోట్లు ఖర్చుచేస్తుంటే అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌నాయక్, ఎంపీపీ జైపాల్‌నాయక్, జెడ్పీటీసీ సభ్యుడు పగడాల రవితేజ, సర్పంచ్‌లు సునితకొండల్‌రెడ్డి, పుష్పలీల, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు