ఇదిగో పులి...

2 Apr, 2017 10:51 IST|Sakshi
ఇదిగో పులి...
⇒ బ్రాహ్మన్‌పల్లి అటవీ ప్రాంతంలో సంచారం
⇒  శుక్రవారం సీసీ కెమెరాకు చిక్కిన వైనం  
⇒  భయాందోళనలో రెండు మండలాల ప్రజలు 
⇒  అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు 
 
చెన్నూర్‌/కోటపల్లి: మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో పులి సంచరిస్తున్న విషయం తేటతెల్లమైంది. పదిహేను రోజుల క్రితమే అటవీ అధికారులు వేమనపల్లి మండలంలో పులి సంచరిస్తుందన్న విషయాన్ని ధ్రువీకరిం చారు. తాజాగా శుక్రవారం వేమనపల్లి మండలం నీల్వాయి, కోటపల్లి మండలం బ్రాహ్మన్‌పల్లి అటవీ ప్రాంతంలో పులి కుర్మ శ్రీనివాస్‌కు చెందిన ఆవును హతమార్చింది. ఆ ప్రాంతంలో లభించిన ఆధారాలను సేకరించిన ఫారెస్ట్‌ అధికారులు పులే ఆవును హతమార్చిందని నిర్ధారించారు.

దీంతో రెండు మండలాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. పులి సంచారాన్ని తెలుసుకునేందుకు కోటపల్లి, వేమనపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్రాహ్మన్‌పల్లి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో శనివారం పులి చిక్కినట్లు అధికారులు తెలిపారు. నాలుగు నెలల తర్వాత. పంగిడి సోమారం గ్రామానికి చెందిన రాళ్లబండి శ్రీనివాస్‌ అనే రైతుకు చెందిన ఆవును గతేడాది నవంబర్‌ 8న అటవీ ప్రాంతంలో పులి హతమార్చింది.

ఈ విషయంలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆవు ఇంటికి రాక పోవడంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా.. 2016 నవంబర్‌ 15న ఆవు కళేబరం లభించింది. ఈ విషయాన్ని ఫారెస్ట్‌ అధికారులకు తెలుపడంతో అటవీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆవును పులి హతమార్చిన అనవాళ్లు లభించడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో సీసీ కెమెరాలో పులి చిక్కింది. 
 
ఒంటరిగా వెళ్లొద్దు..
 
కోటపల్లి అడవుల్లో పులి సంచరిస్తోందని అటవీ ప్రాంతా నికి ఒంటరిగా వెళ్లొద్దని ఫారెస్ట్‌ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ నాలుగు నెలల తర్వాత కోటపల్లి, వేమనపల్లి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మళ్లీ అదే రీతిన పులి ఆవును హతమార్చింది. గతంలో ఆవును హతమార్చిన పులి వారం వ్యవధిలోనే  కోటపల్లి మండలం పిన్నారం అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడి మృతి చెందిం ది. గతంలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా పులి సంరక్షణకు ఫారెస్ట్‌ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారని ఈ ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు. 
 
అంతా గోప్యం.. 
 
వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో పులి సంచరిస్తున్నది సీసీ కెమెరాలో చిక్కినప్పటికీ ఫారెస్ట్‌ అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. పులి సంచరిస్తుందన్న విష యం బయటికి పొక్కితే వేటగాళ్లు మళ్లీ పులిని వేటాడే అవకాశాలుండడంతో అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. ఎట్టకేలకు శనివారం నీల్వాయి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని బ్రాహ్మన్‌పల్లి అటవీ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరాకు పులి చిక్కిన విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. 
 
అప్రమత్తమైన అధికారులు..
గతంలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు పులి సంచరిస్తుందన్న సమాచారం మేరకు పక్షం రోజులుగా చెన్నూర్, కోటపల్లి, నీ ల్వా యి ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు మండలా ల్లో పులి ఎక్కడైనా సంచరించే అవకాశం ఉండడంతో మూడు రేంజ్‌ల సి బ్బందిని అప్రమత్తం చేశారు. గ్రామాల్లో  డప్పు చాటింపు వేయిస్తున్నారు. స్ట్రైకింగ్‌ ఫోర్స్, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది తాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల వేటగాళ్లున్న గ్రామాలను సందర్శించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వన్యప్రాణులను హతమారిస్తే కఠిన చర్యలుంటా యని హెచ్చరికలు జారీ చేస్తూనే.. వారికి అవగాహన కల్పిస్తున్నారు. 
 
ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశాం
 
పులి సంచరిస్తున్న విషయం వాస్తవమే. పులి ఈ ప్రాంతంలో ఉం డేందుకు అన్ని సౌకర్యాలున్నాయి. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ప్రాంతం నుంచి ఇటు వచ్చింది. చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి రేంజ్‌ల అధికారులను అప్రమత్తం చేశారు. బేస్‌ క్యాంప్‌ సిబ్బంది పులి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నీల్వాయిలో ప్రాజెక్ట్‌ ఉండడంతో నీటి వస తి సమృద్ధిగా ఉంది. చిన్నచిన్న జంతువులు పులికి ఆహారంగా మారుతున్నాయి. గతంలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. పాత వేటగాళ్లతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశాం. నీల్వా యి అటవీ ప్రాంతంలో 11కేవీ విద్యుత్‌ తీగలు లేవు. పులికి హానీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటాం.                         – తిరుమలరావు, ఫారెస్ట్‌ డివిజనల్‌ ఆఫీసర్, చెన్నూర్‌   
 
మరిన్ని వార్తలు