విజృంభిస్తున్నాయ్..

3 Sep, 2014 01:49 IST|Sakshi

కొద్దిపాటి జాగ్రత్తలతో..
 విజృంభిస్తున్న వ్యాధుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కొంత మేర వాటిని నివారించవచ్చు. ప్రధానంగా దోమలు, ఈగలు, పారిశుధ్యం, తాగునీటి విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.
 దోమలు వృద్ధి చెందకుండా ఇంటి చుట్టు పక్కల అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూసుకోవాలి.
 వ్యక్తిగత పరిశుభ్రతే కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ఇంటి ముందు పగిలిన సీసాలు, కుండీలు, వాడి పారేసిన టైర్లు, పగిలిన కుండలు, ఖాళీ డబ్బాలు, కూలర్లలో నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి. ప్రధానంగా ఇలాంటి ప్రాంతాల్లోనే దోమలు అధికంగా ఉంటాయి.
 ఎడిస్ దోమలు కృత్రిమంగా నిల్వ ఉన్న నీటిలోనే పెరుగుతాయి.
 దోమ తెరలు వాడడం, వేప ఆకులతో పొగ పెట్టడం వంటివి చేయాలి.
 దోమలు ఇళ్లలోకి రాకుండా కిటికీలకు, తలుపులకు సన్నని జాలీలను ఏర్పాటు చేసుకోవాలి.
 ఇంట్లో దోమలు వృద్ధి చెందకుండా జెట్ మస్కిటో కాయిల్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి.
 పందులు పట్టణంలో ఉండకుండా పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
 ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉంటే ఆ నీటిలో కిరోసిన్, వాడిన ఇంజిన్ ఆయిల్ చుక్కలను వేయాలి.
 ఇంటి మూలలు, పాఠశాలల్లో బెంచీల మూలలు, గదుల మూలలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ ప్రదేశాల్లో దోమలు, ఈగలు అధికంగా వృద్ధి చెందే ప్రమాదం ఉంది.
 పంచాయతీలు, మున్సిపాలిటీల వారు ఎప్పటికప్పుడు మురికి కాలువల శుభ్రత, దోమల మందు స్ప్రే చేయించడం, నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి.
 
 నీటి విషయంలో..
 మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు నీటి సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. బోర్లు, బావులు, చేతిపంపులు, తదితర వాటి చుట్టూ ఎలాంటి మురికి నీరు నిలువ ఉండకుండా చూడాలి. చేతి పంపులకు ప్లాట్‌ఫాంలను నిర్మించాలి. మురికికాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలి.  
 రక్షిత మంచినీటి పథకాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
 క్లోరినేషన్‌ను పకడ్బందీగా చేపట్టాలి.
 నీరు సరఫరా అయ్యే పైప్‌లైన్లను పర్యవేక్షిస్తూ ఉండాలి. లీకేజీలకు మరమ్మతులు చేయించాలి.
 చేతిపంపులు, బావులు, నల్లాల ద్వారా వచ్చే నీటిని అలాగే పట్టుకోకుండా జాలీలు ఏర్పాటు చేసుకోవాలి.
 10 నుంచి 15 నిమిషాలు కాచిన తర్వాత చల్లారిన నీటినే తాగాలి.

 చిన్నారుల విషయంలో..
 వర్షాకాలంలో చిన్నారులు అస్వస్తతకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ జలుబు, దగ్గు, జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

 చిన్నారులు తినే ఆహార పదార్థాలపై దోమలు, ఈగలు వాలకుండా చూడాలి.
 పండ్లు, చాకెట్లు, అన్నం వంటి వాటిని వారి చేతికి ఇవ్వకుండా తల్లిదండ్రులే తినిపించాలి.
 ఈగలు, దోమలు వాలే తినుబండారాలను కొనవద్దని చిన్నారులకు సర్దిచెప్పాలి.
 చిన్నారులకు తినిపించే సమయంలో సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.
 వర్షంలో చిన్నారులు తడవకుండా చూసుకోవాలి.
 ఏ మాత్రం అస్వస్తతకు గురైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని వార్తలు