గతేడాది మార్చి బిల్లునే చెల్లించండి

4 Apr, 2020 02:48 IST|Sakshi

కరోనా నేపథ్యంలో ఈ నెలలో మీటర్‌ రీడింగ్‌ ఉండదు

ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదనలు.. నేడు రానున్న నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి మీటర్‌ రీడింగ్‌ తీసి విద్యుత్‌ బిల్లుల డిమాండ్‌ నోటీసులు జారీ చేయడానికి బదులు ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించాలని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు నిర్ణయం తీసుకున్నాయి. 2019 మార్చిలో జరిపిన వినియోగానికి సంబంధించి చెల్లించిన విద్యుత్‌ బిల్లులనే 2020 మార్చిలో జరిపి న వినియోగానికి సైతం చెల్లించాలని వినియోగదారులను కోరనున్నా యి. కొత్త వినియోగదారులైతే ఫిబ్రవరి 2020 నెలకు సంబం ధించి చెల్లించిన బిల్లు మొత్తాన్నే మార్చి నెల వినియోగానికి సైతం చెల్లించాలని కోరనున్నాయి. దీనికి సంబంధించిన అనుమతుల కోసం శుక్రవారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత మీటర్‌ రీడింగ్‌ తీసి వినియోగదారులు చెల్లించిన బిల్లులను సర్దుబాటు చేస్తామని ఈఆర్సీకి తెలిపాయి. వినియోగంతో పోల్చితే ఎవరైనా అధికంగా బిల్లులు చెల్లిస్తే.. తర్వాత మీటర్‌ రీ డింగ్‌ తీసినప్పుడు వారికి సంబంధించిన తదుపరి నెల బిల్లును ఆ మేరకు తగ్గించి సర్దుబాటు చేస్తారు. ఇదే తరహాలో అధిక వినియోగం ఉండి తక్కువ బిల్లులు చెల్లించిన వారి నుంచి తదు పరి నెల బిల్లులో ఆ మేరకు మిగిలిన మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తామని ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించి శనివారం ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.

మరిన్ని వార్తలు