బీసీల్లో కొత్తగా కులాల చేర్పు లేనట్లే!

12 Oct, 2018 04:54 IST|Sakshi

కొత్త ప్రభుత్వం కొలువుదీరాకే..  

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల్లో మరిన్ని కులాల చేర్పు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్న కులాల చేర్పునకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఇప్పటివరకు ఎలాంటి కేటగిరీలో లేని సంచార జాతులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌ ఉంది. ఏడాది క్రితం బీసీ కమిషన్‌కు 25 కులాల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. వాటి చేరికపై బీసీ కమిషన్‌ పలు సూచనలు సైతం చేసింది. బీసీల్లో ఆ కులాల చేర్పుపై కేంద్రంసలహా తీసుకోవాలని రాష్ట్ర యంత్రాంగం భావించి లేఖ రాసింది. బీసీల్లో ఆయా కులాల చేర్పు నిర్ణయాధికారం రాష్ట్రానికే ఉందంటూ సూచించడంతో ఫైలు కాస్త సీఎం వద్దకు చేరింది. అసెంబ్లీ రద్దు కావడంతో సీఎం కొత్తగా నిర్ణయాలు తీసుకునే వీలు లేకుండా పోయింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా అమల్లోకి రావడంతో సీఎం కార్యాలయం బీసీ కులాల చేర్పునకు సంబంధించిన ఫైలును వెనక్కి పంపినట్లు సమాచారం. దీనిపై కొత్త ప్రభుత్వంలోనే స్పష్టత వస్తుందని ఓ అధికారి చెప్పారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు