టీఆర్‌ఎస్‌కు విలువలు లేవు

11 Apr, 2014 00:15 IST|Sakshi

అల్లాదుర్గం రూరల్, న్యూస్‌లైన్:  టీఆర్‌ఎస్ పార్టీకి విలువుల లేవని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విమర్శించారు. గురువారం అల్లాదుర్గం మండలం చిల్వెర ఐబీ వద్ద ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధాంత భావజాలం లేని టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణను ఏం పాలిస్తుందని  ప్రశ్నించారు. కేసీఆర్ తన కొడుకుకు సిరిసిల్లా, కూతురుకు నిజామాబాద్, అల్లుడికి సిద్దిపేటలో టికెట్ ఇచ్చి కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

బాబుమోహన్, హన్మం త్‌రావ్, మాణిక్‌రెడ్డిలు ఎన్ని పార్టీలు మారారని, 24గంటల్లో కండువా మార్చిన వారికి టికెట్‌లు కేటాయిస్తూ వలసలను పోత్సహిస్తున్నారని విమర్శించారు. నాయకులు గ్రూపులు చేసుకొని  పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తే రా జకీయ వ్యభిచారం చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉం డి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు తమ ఉనికి కాపాడుకోవడానికి గ్రూపులు చేయడం మంచిపద్దతి కాదని హితవు పలికారు.
 తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే మెజార్టీ సీట్లువచ్చే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇతర పార్టీలో చిచ్చుపెట్టి తాను రాజకీయ లబ్ధి పొ ందేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సభ్యులు సంగమేశ్వర్, నాయకులు జగదీశ్వర్, నారాయణగౌడ్, శేషారెడ్డి, నర్సింహా రెడ్డి, అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు