లింకు తెగింది

18 Mar, 2016 03:11 IST|Sakshi
లింకు తెగింది

భూపాలపల్లిలో బొగ్గు ఉన్నా
రామగుండం నుంచి రవాణా
బొగ్గు దిగుమతిలో అడ్డదారులు
జెన్‌కోకు కోట్లలో రవాణా భారం

 
 
 కోల్‌బెల్ట్(వరంగల్) :  భూపాలపల్లి ఏరియా గనులలో ఉత్పత్తి అవుతున్న బొగ్గును సమీపంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కోసం తీసుకోవడానికి టీఎస్ జెన్‌కో సింగరేణి యాజమాన్యంతో లింకేజీ కుదుర్చుంది. ఒప్పం ద నియమాలకు విరుద్ధంగా కేటీపీపీ అధికారులు వ్యవహరించడంతో జెన్‌కోపై సుమారు రూ.34కోట్లు అదనపు భారం పడింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నారు.

 బొగ్గు, నీటి వనరులు అందుబాటులో ఉండడంతో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పతి చేయవచ్చని వరంగల్ జిల్లా చెల్పూర్ సమీపంలో ప్రభుత్వ రంగంలో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఇందుకు భూపాపల్లి ఏరియూ గనుల నుంచి ఉత్పత్తి అరుున బొగ్గు తీసుకోవడానికి టీఎస్ జెన్‌కో, సింగరేణి మధ్య కోల్ లిం కేజీ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం జి-11 గ్రేడ్ బొగ్గును టన్నుకు రూ.1300 చొప్పున ఇస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రోజుకు సుమారు 10వేల టన్నుల చొప్పున మొత్తం 22లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉంది. కేటీపీపీ ఇప్పటి వరకు 16,91,831 టన్నులు దిగుమతి చేసుకుంది. ఆర్థిక సంవత్సరం ముగి యడానికి 13 రోజులు మాత్రమే ఉంది. ఇంకా సుమారు 5లక్షల టన్నులు తీసుకోవాలి. ఏరి యాలోని గనుల వద్ద 1.1 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది.

అయినా కేటీపీపీ అధికారులు అదే గ్రేడ్ బొగ్గును రామగుండం ఏరియా జీడీకే-1 సీహెచ్‌పీ నుంచి 3,66,658 టన్నులు దిగుమతి చేసుకున్నారు. భూపాలపల్లి గనుల నుంచి కేటీపీపీకి 14 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడి నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటే రవా ణా ఖర్చు టన్నుకు రూ.5.85 పైసలు మాత్రమే అవుతుంది. జీడీకే సీహెచ్‌పీ నుంచి రైలు వ్యాగన్‌ల ద్వారా ఉప్పల్ వరకు రవాణా చేసిన బొగ్గు ను అక్కడ డంప్ చేసి తిరిగి రోడ్డు మార్గంలో 60కిలోమీటర్ల దూరంలోని కేటీపీపీకి తరలిం చారు. ఇలా చేయడం వల్ల లోడింగ్ అన్‌లోడింగ్ చార్జీలతో కలుపుకుని టన్నుకు రూ.900 చొప్పున సుమారు రూ.34కోట్ల రవాణా భారం అదనంగా పడినట్లు సమాచారం.
 
అందుబాటులో ఉన్నా..
 భూపాలపల్లిలో నిల్వలు పెరిగి పోవడంతో ఓపెన్‌మార్కెట్‌లో విక్రరుుంచడానికి మూడు నెలల క్రితం టెండర్ ద్వారా రామగుండం ఓసీపీ-3 సీహెచ్‌పీకి 3,78,229 టన్నులు రవాణా చేశారు. అదే బొగ్గు ఈ ఏడాది జనవరి 10న 4067 టన్నులు కేటీపీపీకి పంపించారు. రామగుండం, మణుగూరు నుంచి జీ-5గ్రేడ్ బొగ్గును సైతం దిగుమతి చేసుకుంటున్నారు. జీ-5 గ్రేడ్ భూపాలపల్లిలోనూ ఉత్పత్తి అవుతోంది. దగ్గరలో ఉన్న బొగ్గును తీసుకోకుండా దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని బట్టి చూస్తే బొగ్గు రవాణాలో అధికారుల తీరు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా భూపాలపల్లి నుంచి రామగుండంకు బొగ్గు రవాణా చేసే కాంట్రాక్టర్, ఉప్పల్ నుంచి కేటీపీపీ బొగ్గు రవాణా చేసే కాంట్రాక్టర్ ఒక్కరే కావటం గమనార్హం. అంతా కుమ్మకై అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
 
 కేటీపీపీ వారే తీసుకుపోవడం లేదు

ఏరియా గనుల నుంచి జి-11 గ్రేడ్ బొగ్గు రోజుకు 7వేల టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఇప్పటికే 9 లక్షల టన్నులు నిల్వ ఉంది. లింకేజీ ప్రకారం కేటీపీపీకి సరఫరా చేయటానికి ఎటువంటి ఇబ్బందులు లేదు. సత్వర రవాణాకు అత్యాధునిక వేరుుంగ్ బ్రిడ్జిలతోపాటు షావల్, డంపర్, లోడర్ యంత్రాలను సైతం సమకూర్చాం. అరుునా వారు తీసుకుపోవడం లేదు. - పి.సత్తయ్య, సింగరేణి ఏరియూ జీఎం, భూపాలపలి

>
మరిన్ని వార్తలు