అవి ముమ్మాటికీ ప్రభుత్వ భూములే

13 Jun, 2017 01:37 IST|Sakshi

కొత్త మలుపు తిరిగిన కేకే భూముల వ్యవహారం ప్రభుత్వానికి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రాథమిక నివేదిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుటుంబీకుల భూముల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలోని గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ నుంచి కొనుగోలు చేసిన 36 ఎకరాలు ప్రభుత్వ భూమేనని జిల్లా యంత్రాంగం తేల్చిచెప్పింది. ఈ భూమి కొను గోలుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీనిపై కేకే వివరణ ఇచ్చిన సం గతి తెలిసిందే. ప్రభుత్వ, రెవెన్యూ యంత్రాంగాల నిరభ్యంతర పత్రాల ఆధారం గానే తాను భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నానని కొన్ని పత్రాలను చూపించి ఆయన ఈ వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.

ఈ వ్యవహారంలో ఇబ్రహీంపట్నం ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌పై తీసుకున్న చర్యలను ఖండించారు. ఇది ముమ్మాటికీప్రైవేటు భూమేనని నిర్ధారించుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నానని కేకే చెబుతుండగా.. మరోవైపు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం దీనికి విరుద్ధంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ భూములు 22 ఏ కింద ప్రకటించిన ప్రభుత్వ భూములని, రికార్డుల్లో కూడా అలాగే ఉందని స్పష్టం చేస్తూ రాష్ట్ర సర్కారుకు నివేదిక అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలను తీసుకోనుంది. ఈ ప్రాథమిక నివేదిక కేశవరావు కుటుంబీకులకు కొత్త కష్టాలు తెచ్చే విధంగా ఉంది. 

>
మరిన్ని వార్తలు