దోపిడీ దొంగల ముఠా అరెస్ట్‌ 

6 Oct, 2019 10:07 IST|Sakshi
అరెస్ట్‌ అయిన ముఠాను చూపిస్తున్న సీఐ కరుణాకర్‌

సాక్షి, కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందు క్రాస్‌ రోడ్డు వద్ద చుంచుపల్లి సీఐ కరుణాకర్‌ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పందంగా కనిపించడంతో  దోపిడీ దొంగలుగా గుర్తించి అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో  శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన అబ్దుల్‌ ఖలీల్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచా రణ చేపట్టిన సీఐ కరుణాకర్, బృందం సీసీ కెమెరాల ద్వారా 13 మంది గ్యాంగ్‌ను గుర్తించడం జరిగిందన్నారు. వీరు ఈ నెల 29న ఖలీల్‌ అనే వ్యక్తికి మాయమాటలు చెప్పి మహిమలు కలి గిన నల్లపసుపు ఉన్నట్లు నమ్మబలికి అతనిని రప్పించి లక్ష్మీదేవిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లోతువాగు వద్దకు చేరుకున్న అతనిపై  గ్యాంగ్‌ దాడిచేసి అతని వద్ద ఉన్న రెండు లక్షల రూపాయలను తీసుకొని పారిపోయారు.

సీసీ కెమెరాల ఆధారంగా వీరిని గుర్తించిన లక్ష్మీదేవిపల్లి పోలీసులు ఇల్లెందు క్రాస్‌ రోడ్డు వద్ద ఏడుగురిని అరెస్టు చేశారు. పట్టుబడిన ఈ ఏడుగురి వద్ద నుంచి రూ.1,64,000లను, 4 బైకులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సీఐ కరుణాకర్‌ తెలిపారు. విచారణ అనంతరం పట్టుబడిన వీరందరినీ  టేకులపల్లి మండలంగా గుర్తించామన్నారు. 13 మందిలో మిగతా ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని అన్నారు. విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడి సులువైన మార్గాల్లో డబ్బు సంపాదించడానికి ఇలాం టి నేరాలకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు సీఐ తెలిపారు. వీరిని  రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు.తనిఖీలలో ప్రొబేషనరీ ఎస్‌ఐ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు