దోపిడీ దొంగల హల్‌చల్‌! 

20 Jul, 2019 13:05 IST|Sakshi
గాలీపూర్‌లో ఉపయోగించిన కర్రలు, తాళ్లు

ఒకే తీరుగా వరుస చోరీలు 

పోలీసులకు పెను సవాలు 

తాళాలు వేసిన ఇళ్లు, కిటికీలే టార్గెట్‌ 

దొంగల సంచారంతో ప్రజల్లో భయాందోళన

నిజాంసాగర్‌(జుక్కల్‌): వర్షాభావ పరిస్థితులు ఓ వైపు.. దోపిడీ దొంగల సంచారం మరో వైపు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బాన్సువాడ సర్కిల్‌ పరిధిలో వరుస చోరీలు జరుగుతుండటంతో పోలీసులకు సవాలుగా మారింది. తాళాలు వేసి ఉన్న ఇళ్లతో పాటు ఇంటి వెనుక భాగంలో ఉన్న కిటికీలను ధ్వంసం చేస్తూ దుండగులు చోరీలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న నిజాంసాగర్‌ మండలం గాలీపూర్, ముగ్థుంపూర్, నర్సింగ్‌రావ్‌పల్లి గ్రామాల్లో దొంగలు దోపిడీలు చేశారు. ఆ సంఘటనలు మరుక ముందే పిట్లం మండల కేంద్రంలో బంగారు దుకాణంలో భారీ చోరీ కావడంతో పోలీసులకు పెను సవాలుగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన చోరీలను పోలీసులు మామూలుగా తీసుకున్నారు. దొంగలను నివారించడంతో విఫలం చెందడంతో పట్టణాల్లో చోరీలకు పాల్పడి పోలీసులకు ముచ్చెమటలు పట్టించేలా చేస్తున్నారు. గాలీపూర్, మగ్థుంపూర్‌ గ్రామాల్లోని నాల్గు ఇళ్లల్లో చోరీలు, నర్సింగ్‌రావ్‌పల్లిలోని ఓ ఇంట్లో చోరీ జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పిట్లం మండల కేంద్రంలోని నగల దుకాణంలో రూ.30లక్షల నగలు చోరీకి గురవడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దోపిడీ దొంగల కోసం మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలతో పాటు పాత నేరస్థులపై నిఘా పెట్టారు. పిట్లంలోని నగల దుకాణంలో సైతం దొంగలు కిటికీలను ధ్వంసం చేసి చోరీ చేశారు. ఇలా వరుస చోరీలు ఒకే మాదిరిగా జరుగడంతో ఒకే ముఠాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామాల వైపు పోలీసుల నిఘా లేకపోవడం, రాత్రివేళ పెట్రోలింగ్‌ సైతం తగ్గడంతో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లక్కోరలో మహిళ దారుణ హత్య 

పురుగులమందు పిచికారీకి ఆధునిక యంత్రం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ కనుమరుగు

‘బీ–ట్రాక్‌’@ గ్రేటర్‌

సీతాకోక చిలుకా.. ఎక్కడ నీ జాడ?

ఫ్లోరైడ్‌ బాధితుడి ఇంటి నిర్మాణానికి కలెక్టర్‌ హామీ

మరింత ఆసరా!

పైసా వసూల్‌

పురుగుల అన్నం తినమంటున్నారు..!

‘హరీష్‌ శిక్ష అనుభవిస్తున్నాడు’

ఆస్పత్రి గేట్లు బంద్‌.. రోడ్డుపైనే ప్రసవం..!

కిడ్నాప్‌ ముఠా అరెస్టు

సారొస్తున్నారు..

డబ్బుల కోసమే హత్య.. పట్టించిన ఫోన్‌ కాల్‌

బీకాం ఎక్కువగా ఇష్టపడుతున్న డిగ్రీ విద్యార్థులు

‘అవ్వ’ ది గ్రేట్‌

పదవిలో ఆమె.. పెత్తనంలో ఆయన

పెట్రో ధరలు పైపైకి..

బోనాలు.. ట్రాఫిక్‌ ఆంక్షలు

జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం!

ఎండిన సింగూరు...

ఖమ్మంలో ఎంతో అభివృద్ధి సాధించాం

డబ్బులు తీసుకున్నారు..   పుస్తకాలివ్వలేదు..

పాములను ప్రేమించే శ్రీను ఇకలేడు..

గొర్రెలు చనిపోయాయని ఐపీ పెట్టిన వ్యక్తి

ఏసీబీ విచారణ : తల తిరుగుతోందంటూ సాకులు

పోడు భూముల సంగతి తేలుస్తా

త్వరలో రుణమాఫీ అమలు చేస్తాం 

మున్సిపల్‌ చట్టం.. బీసీలకు నష్టం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..