హోం క్వారంటైన్‌లో ఉన్నవారు ప్రయాణించకండి

22 Mar, 2020 01:53 IST|Sakshi

తోటి ప్రయాణికులు గుర్తిస్తే మాకు చెప్పండి : రైల్వే శాఖ విజ్ఞప్తి 

సాక్షి, హైదరాబాద్‌ : విదేశాల నుంచి వచ్చి వైద్యుల సూచన మేరకు స్వీయ గృహనిర్బంధంలో ఉండాల్సిన వారు గడువు ముగియకుండానే ప్రయాణాలు చేయటం సరికాదని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. కొన్ని రోజులుగా... స్వీయ గృహనిర్బంధంలో ఉం డాల్సిన వారు రైళ్లలో ప్రయాణిస్తూ పట్టుబడుతున్న నేపథ్యంలో అధికారికంగా ఆదివారం ఓ ప్రకటన వి డుదల చేసింది. ‘స్వీయ గృహనిర్బంధంలో ఉండాలన్న సూచనను తీవ్రంగా పరిగణించించాలి. 14 రోజులు ఇంటి పట్టునే ఉండి, ఆ తర్వాత కోవిడ్‌ ప్రభావిత లక్షణాలు లేకుంటే స్వేచ్ఛగా తిరగవచ్చు. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి వారు ప్ర యాణిస్తుంటే తోటి ప్రయాణికులు అధికారుల దృ ష్టికి తేవాలి. వెంటనే హోం క్వారంటైన్‌లో ఉన్నవారిని తిరిగి వారిళ్లకు పంపుతాం’ అని ప్రకటనలో రైల్వే అధికారులు వెల్లడించారు. తోటి ప్రయాణికులెవరైనా దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తిస్తే వెంటనే రైల్వే అధికారుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది.

టికెట్‌ రద్దు నిబంధనల్లో సడలింపులు 
టికెట్‌ రద్దు నిబంధనలను రైల్వే సడలించింది. రద్ద యిన రైళ్లకు సంబంధించి టికెట్‌ డబ్బులు తిరిగి తీ సుకునేందుకు ప్రస్తుతం 3 రోజులుగా ఉన్న గడువు ను 3 నెలలకు పెంచింది. మార్చి 21 నుంచి జూన్‌ 21 మధ్య ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ప్రయాణ తేదీ నుంచి 3 నెలల వరకు టికెట్‌ డబ్బులు తిరిగి తీసుకోవచ్చు. కౌంటర్లలో టికెట్లు చూపడం ద్వారా ఆ మొత్తాన్ని పొందే వీలుంటుంది. ప్రయాణికులే ప్రయాణాలు రద్దు చేసుకున్న సమయంలో.. రైలు ప్రయాణ తేదీ నుంచి 3 నెలల్లో టికెట్‌ డిపాజిట్‌ రశీ దు (టీడీఆర్‌) ఫైల్‌ చేయాలి. అలా చేసిన 60 రోజు ల్లో పత్రాలు చూపి టికెట్‌ డబ్బులు పొందవచ్చు. 139 ద్వారా టికెట్‌ రద్దు చేసుకుంటే, ఏ  స్టేషన్‌ కౌంటర్‌ నుంచైనా మూడు నెలల్లో పొందొచ్చు.

మరిన్ని వార్తలు