వేయిస్తంభాల గుడి పక్కన ‘యెతిమ్‌ఖానా’

2 Aug, 2015 03:32 IST|Sakshi
వేయిస్తంభాల గుడి పక్కన ‘యెతిమ్‌ఖానా’

వేయిస్తంభాల గుడి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో యెతిమ్‌ఖానా(అనాథాశ్రమం) ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహముద్ అలీ అన్నారు. హన్మకొండలోని జక్రియా ఫంక్షన్‌హాల్‌లో శనివారం నిర్వహించిన ‘ఈద్‌మిలాప్’ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. దాదాపు 2 కోట్ల మంది ముస్లింలకు రంజాన్ పండుగ సరుకులు అందజేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తర్వాత ఆయన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. కలెక్టరేట్‌ను కూడా పరిశీలించారు.
 
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ    
హన్మకొండ చౌరస్తా :
వేయిస్తంబాలగుడి సమీప ప్రభుత్వ స్థలంలో యెతిమ్‌ఖానా(అనాథాశ్రమం) ఏర్పాటు చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హన్మకొండలోని జక్రి యా ఫంక్షన్‌హాల్ లో శనివారం నిర్వహించిన ‘ఈద్‌మిలాప్’ కార్యక్రమానికి ఆయన హాజరై మా ట్లాడారు.

రాష్ట్రంలో తొలిసారి రంజాన్ పర్వదినాన్ని అధికారికంగా నిర్వహించింది కేసీఆర్ సర్కారేనన్నారు. సుమారు  2 కోట్ల మంది ము స్లింలకు పండుగ సరుకులు అందజేసి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారన్నారు.  జిల్లాలో వక్ఫ్‌బోర్డు స్థలాల ను చూపెడితే ఖబరస్థాన్‌ల ఏర్పాటుకు అధికారులతో చర్చిస్తామన్నారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మా ట్లాడుతు తెలంగాణ ఉద్యమంలో ముస్లిం మైనారిటీలు ముందు వరుసలో నిలిచారన్నారు.

ముస్లింల జీవన విధానంపై సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక చూసి కేసీఆర్ కంటతడి పెట్టారని గుర్తు చేశారు. టీ ఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ, ఎన్ని ఆరోపణలు ఎదురైనా నిజాం సర్కార్ పనితీరును మెచ్చుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. అనంతరం డిప్యూటీ సీం పెద్దమ్మగడ్డ ఈద్గా పరిశీలించారు. వివాదంలో ఉన్న స్థలాల సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో లింగంపల్లి కిషన్‌రావు, కోలా జనార్దన్, మహ్మద్ నయిమొద్దీన్, డాక్టర్ అనీఫ్ సిద్దిఖీ, వెంకటాచారి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు