ఓరుగల్లుకు మరో మూడు ఐటీ కంపెనీలు

6 Mar, 2018 11:46 IST|Sakshi

ఆవిష్కరణలకు నాంది పలకాలి : మంత్రి కేటీఆర్‌

హసన్‌పర్తి: హైదరాబాద్‌–వరంగల్‌ను ఐటీ కారిడార్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. హసన్‌పర్తి మండలం అన్నాసాగరంలోని ఎస్సార్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఇన్నోవేషన్‌ ఎక్సే్ఛంజ్‌ సెంటర్‌ను సోమవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నవీన ఆవిçష్కరణాలకు నాంది పలకాలని కోరారు. ఇటీవల నల్లగొండ జిల్లాకు చెందిన చింతకింది మల్లేశం (పదో తరగతి చదివిన యువకుడు) ఆవిష్కరించిన  ‘లక్ష్మీ ఆసు యంత్రం’ (చేనేత యంత్రం)తో పదివేల మందికి ఉపాధి చేకూరిందన్నారు. దీంతో అతడికి ప్రోత్సాహకంగా రూ.కోటి రుణం అందించినట్లు మంత్రి చెప్పారు. డిసెంబర్‌లో మరో మూడు ఐటీ కంపెనీలు ఓరుగల్లులో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని తెలిపారు. ఇప్పటికే సైయంట్‌ కంపెనీ ప్రారంభమైందని, త్వరలోనే మహేంద్ర కంపెనీ వరంగల్‌కు వస్తుందని వివరించారు. ఐటీ కంపెనీల ఏర్పాటుతో విద్యార్థులకు ఎక్కువ మొత్తంలో ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు.  

కేటీఆర్‌ కేంద్ర మంత్రి అయితే అమెరికా కంటే అభివృద్ధి
మంత్రి తారక రామారావు కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తే అమెరికా కంటే భారతదేశం ఐటీ అభివృద్ధిలో ముందు వరుసలో ఉండేదని పారిశ్రామికవేత్త రతన్‌టాటా స్పష్టం చేసిన ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గుర్తు చేశారు. వరంగల్‌ జిల్లాలో మరిన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను తీసుకురావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. ఎస్సార్‌ విద్యాసంస్థల చైర్మన్‌ ఎ.వరదారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, తాటికొండ రాజయ్య, శంకర్‌నాయక్, మేయర్‌ నన్నపునేని నరేందర్, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పద్మ, జేఎన్‌టీయు వీసీ వేణుగోపాల్‌రెడ్డి, టై కంపనీ ఉపా«ధ్యక్షుడు సురేష్‌రెడ్డి, ఎన్‌ఎస్‌టీఈడీబీ కార్యదర్శి వర్గ సభ్యుడు హరికేష్‌కుమార్‌ మిట్టల్, ఎస్‌ఐడీబీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవిత్యాగి, ఎస్సార్‌ ఐఎక్స్‌ కోఆర్డినేటర్‌ శ్రీదేవి, ఎంపీపీ కొండపాక సుకన్యరఘు ,గ్రామసర్పంచ్‌ రత్నాకర్‌రెడ్డి, జక్కు రమేష్‌ గౌడ్,రాజునాయక్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు