ఎక్కడచూసినా అవే బారులు

22 Mar, 2020 01:40 IST|Sakshi
ఎర్రమంజిల్‌లోని ఓ పెట్రోల్‌బంక్‌ వద్ద ఇలా..

‘జనతా కర్ఫ్యూ’తో భారీగా కొనుగోళ్లు

అత్యవసర సేవల కోసం అందుబాటులో 3వేల పెట్రోల్‌బంక్‌లు

పెట్రోల్‌ ట్యాంకర్లు మాత్రం నిలిపివేత  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం లో 24 గంటల జనతా కర్ఫ్యూ నేపథ్యంలో నిత్యావసరాల కొనుగోళ్లకు ప్రజలు శనివారం మార్కెట్లకు పోటెత్తారు. రైతు బజార్‌లు, స్థానిక మార్కెట్లతోపాటు సూపర్‌ మార్కెట్‌లు, మాల్స్‌కు పరుగులు తీశారు. కోవిడ్‌–19 వ్యాప్తి దృష్ట్యా వివిధ రాష్ట్రా ల సరిహద్దులు మూసేస్తుండటం, ఈ ప్రభా వం సరుకు రవాణాపై పడే అవకాశం ఉండటంతో నిత్యావసరాల ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో కూరగాయలతోపాటు నెలకు సరిపడా బియ్యం, పప్పులు, నూనెలు, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు.

తెరిచే ఉండనున్న పెట్రోల్‌ బంకులు 
ప్రభుత్వం అత్యవసర సేవలను దృష్టిలో పెట్టు కొని పెట్రోల్‌బంక్‌లకు మినహాయింపు ఇచ్చింది. అంబులెన్స్‌లు, పోలీసు, రెవెన్యూ వాహ నాలతో క్వారంటైన్‌ సేవలను దృష్టిలో పెట్టుకొ ని పెట్రోల్‌ బంకులను తెరిచే ఉంచనున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషన ర్‌ సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. బంకులో పెట్రోల్‌ లేదా డీజిల్‌ పోసే యూనిట్లు 3–4 ఉంటే సిబ్బంది సంఖ్యను తగ్గించి ఒక్కో యూనిట్‌ మాత్రమే అందుబాటులో ఉం టుందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3 వేల పెట్రోల్‌ బంకుల్లో ఇదే విధానం ఉంటుందని పెట్రోల్‌ బంకు డీలర్ల సంఘం నేత దినేశ్‌రెడ్డి తెలిపారు. అయితే పెట్రోల్‌ ట్యాంకర్లు మా త్రం ఆదివారం ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలో రోజూ 10 లక్షల లీటర్ల మేర పెట్రోల్, డీజిల్‌ అవసరాలు ఉంటాయని, ఇందుకోసం రాష్ట్రానికి సంబంధించిన 3 వేల ట్యాంకర్లు, 12 వేల ఇతర రాష్ట్రాల ట్యాంకర్లు సరఫరా చేస్తుంటాయని, ఆదివారం వాటిని ఎక్కడికక్కడే నిలిపివేస్తామని ట్యాంకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి రాజశేఖర్‌ వెల్లడించారు. ఇతరత్రా ఇబ్బందు లెదురైనా.. రాష్ట్రంలో వారానికి సరిపడా నిల్వలున్నాయని తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా