‘మనూ’కు అరుదైన అవకాశం

20 Dec, 2018 08:40 IST|Sakshi
ఉర్దూ విశ్వవిద్యాలయంలోని ఐఎంసీ సెంటర్‌ భవనం

జాతీయ సైన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌కు మూడు చిత్రాల ఎంపిక

ఈ మూడు చిత్రాలనూ నిర్మించిన మనూ ఐఎంసీ

రాయదుర్గం: మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి అరుదైన అవకాశం దక్కింది. గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయంలోని ఇన్సస్ట్రక్సనల్‌ మీడియా సెంటర్‌ (ఐఎంసీ) నిర్మించిన మూడు చిత్రాలు జాతీయ సైన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌–2019కు ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా ఐఎంసీ డైరెక్టర్‌ రిజ్వాన్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో 9వ జాతీయ సైన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను జనవరి 27 నుంచి 31 వరకు నిర్వహిస్తారన్నారు. ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను చండీగఢ్‌లోని మొహాలీలో నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేçస్తున్నారన్నారు.

ఈ సైన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులు ఇంటర్‌ఫేస్‌ కేటగిరీలో 15 చిత్రాలతో తుది జాబితాను విడుదల చేయగా.. అందులో మూడు ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందినవి కావడం గర్వకారణమన్నారు. ఉర్దూ యూనివర్సిటీ నుంచి ఎంపికైన చిత్రాల్లో ‘భారతరత్న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌’ (డైరెక్టర్‌–ఒబైదుల్లా రైహన్‌), ‘ప్రొఫసర్‌ యూ ఆర్‌ రావు (డైరెక్టర్‌–మహ్మద్‌ ముజాహిద్‌ అలీ), స్టీఫెన్‌ హాకింగ్‌ (డైరెక్టర్‌–ఒమర్‌ ఆజ్మీ) చిత్రాలు ఉన్నాయన్నారు. మూడు చిత్రాలు జాతీయ సైన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపిక కావడం పట్ల యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ డాక్టర్‌ మహ్మద్‌ అస్లామ్‌ ఫర్వేజ్, విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, మీడియా సెంటర్‌ను అభినందించారు. మూడు చిత్రాలు కూడా ఉర్దూ భాషలో చిత్రీకరించినవి ఎంపిక కావడం విశేషమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆలోచింపజేసే, సాంకేతికతను చాటే చిత్రాలను రూపొందించాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు