కేంద్ర నిధులు పూర్తిస్థాయిలో రాబడదాం

4 Feb, 2017 03:14 IST|Sakshi

‘మహిళాభివృద్ధి’ సమీక్షలో తుమ్మల
సాక్షి, హైదరాబాద్‌: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రతీ పైసా రాబట్టేలా చర్యలు తీసుకో వాలని మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదే శించారు. నిధుల విడుదలలో జాప్యం జరిగితే ఢిల్లీ వెళ్లి అక్కడి అధికారులపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. శుక్రవారం తన చాంబర్‌లో మహిళాభి వృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, కమిషనర్‌ విజయేందిర తదిత రులతో ఆయన సమావేశం నిర్వ హించారు.

కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా మహి ళాభివృద్ధి శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించాలని, ఈమేరకు కేంద్ర గణాంకాలను విశ్లేశించి ప్రణాళిక తయారు చేయాలని తుమ్మల సూచించారు. మహి ళా శక్తి కేంద్రాలు, తల్లుల పౌష్టికాహారం, క్రెచ్‌ పథకం, బేటీ బచావో’–బేటీ పడావో, మహిళల భద్రతకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందని, వీటిద్వారా రాష్ట్రానికి సుమారు రూ.వెయ్యి కోట్లు వచ్చే అవకాశముందని అన్నారు.

మరిన్ని వార్తలు