గొల్లపల్లి అడవిలో పులి సంచారం

20 Jan, 2020 11:01 IST|Sakshi
గొల్లపల్లి అడవిలో కనిపించిన పులి అడుగులు

నెన్నెల(బెల్లంపల్లి): మండలంలోని గొల్లపల్లి అడవిలో పులి సంచరిస్తోంది. ఆదివారం గొర్లకాపరులు పులి అడుగులను గుర్తించారు. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సర్పంచ్‌ ఇందూరి శశికళ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. నెల రోజుల క్రితం గొల్లపల్లి, ఖమ్మంపల్లి శివారులో పోచమ్మగుండాల వద్ద పులి సంచరించింది. గ్రామస్తులు అడుగులను గుర్తించి ఫొటోలు సైతం తీశారు. నెలలో మూడుసార్లు పులి జాడలను గొల్లపల్లి శివారు ప్రాంతాలలో గుర్తించడంతో పులి ఇదే ప్రాంతంలో ఆవాసం ఏర్పచుకుందేమోనని గ్రామస్తులు భయంతో వణుకుతున్నారు.

వ్యవసాయ క్షేత్రంలో చిరుత పులి
నర్సాపూర్‌(జి): మండల కేంద్రం సమీపన గాడి ప్రభాకర్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో శనివారం రాత్రి చిరుత పులి అడుగులను రైతు ప్రభాకర్‌ గుర్తించారు. సమాచారాన్ని వెంటనే అటవీ శాఖ అధికారులకు అందజేశారు. సంఘటన స్థలాన్ని డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వో గౌత్‌ పరిశీలించి చిరుత పులి అడుగులుగా నిర్ధారించారు. మండలంలోని కుస్లి, గోల్లమాడ, అంజనితండా గ్రామాల్లో చిరుత పులి ఆవులను, మేకలను హతమార్చింది. సమీప గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. 

మరిన్ని వార్తలు