గిరిపల్లెల్లో పులి సంచారం!

9 Dec, 2019 09:09 IST|Sakshi

ఎంపల్లి శివారులో గ్రామస్తులు

గుర్తించిన పులి అడుగు

భయాందోళనలో గిరిజనులు

నార్నూర్‌(ఆసిఫాబాద్‌): వారంరోజులుగా గిరి పల్లెల్లో పులి సంచరిస్తుండడంతో గిరి జనులు భయాందోళనకు గురవుతున్నారు. ఐదురోజుల క్రితం మండలంలోని మల్కుగూడ శివారులో పత్తి ఏరేందుకు వెళ్లిన విజయలక్ష్మి అనే గిరిజన యువతికి పులి కనిపించడంతో తప్పించుకుని ఇంటికి పరుగులు తీసింది. ఈ సంఘటన మరువకముందే ఆదివారం మండలలోని ఎంపల్లి కొలాంగూడ గ్రామ శివారులో పత్తి చేనులోని పత్తి ఏరేందుకు వెళ్లిన గిరిజన మహిళ నీలాబాయితో పాటు మరో ఆరుగురు మహిళలకు పులి కనిపించడంతో ఇళ్లకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్‌కుమార్‌ గ్రామానికి చేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

గిరిజనులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని సూచించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని ఎఫ్‌ఎస్‌వో ప్రకాష్‌ సందర్శించి పులిని చూసిన గిరిజన మహిళల ద్వారా సమాచారం సేకరించారు. పులి ఆనవాళ్లను పరిశీలిస్తున్నామన్నారు. గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అటవీశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. పులి సంచరిస్తున్న విషయం తెలియడంతో అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు కర్రలతో గస్తీ నిర్వహిస్తున్నారు. అటవీశాఖ అధికారులు పులి సంచారంపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రాణాలు కాపాడాలని గిరిజనులు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి పాకెట్‌ మనీ రూ.500 ..

దిశా ఘటనపై గవర్నర్‌ తమిళిసై ఉద్వేగం

క్రిస్మస్‌ గిఫ్ట్‌లు రెడీ

నేడు ‘యాదాద్రి’కి గవర్నర్‌ రాక

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

నేటి ముఖ్యాంశాలు..

వీళ్లు మారరంతే!

మా బిడ్డలూ ఆడబిడ్డలే కదా..

‘టిన్నర్‌’ దాడి నిందితుడు ఆత్మహత్య

కాళేశ్వరం నీరు... ‘కృష్ణ’కు చేరు

సరుకుకు రక్షణ.. సులభతర రవాణా

ఏటా 724.3 ఎంయూల విద్యుదుత్పత్తి!

స్కిల్‌ @ హాస్టల్‌

జీవన దాతలకోసం...ఎదురుచూపులే!

ఆర్టీసీకి ఎలక్ట్రిక్‌ షాక్‌!

‘వజ్ర’కు సెలవు!

పక్కాగా జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలు 

పట్టుకున్న చెయ్యే పేల్చిందా..? 

వారిని ఏ తుపాకీతో కాల్చారు?

అక్కడ అసలేం జరిగింది?

దిశ కేసు : నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్‌ ఏర్పాటు

ఈనాటి ముఖ్యాంశాలు

విషాదం: ప్రాణం తీసిన గాలిపటం

‘తెలంగాణను కాంట్రాక్టర్ల రాష్ట్రంగా మార్చేశారు’

హయత్‌నగర్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన!

ప్రజల కోసమే పోలీసులు పనిచేయాలి:భట్టి

స్టేట్ పోలీస్ అకాడమీకి చేరుకున్న దిశ తల్లిదండ్రులు!

ఎన్‌కౌంటర్‌పై నారాయణ క్షమాపణలు

కదిలిన ఆదివాసీ దండు

కేర్‌ ఆస్పత్రికి ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ప్రతిరోజూ పండుగే’ ప్రమోషన్‌లో గొడవ

బాలీవుడ్‌లోనే ఆదరణ!

కమల్‌ పోస్టర్లపై పేడ వేశాను

చిరు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి మృతి

కథా బలం ఉన్న సినిమాలు హిట్టే

సినిమాల పైరసీ నేపథ్యంలో..