టీజేఎస్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

11 Nov, 2018 17:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాంపల్లిలోని టీజేఎస్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్‌ టిక్కెట్‌ రాజేందర్‌కు ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్త మల్లేష్‌ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుకుసున్న కోదండరాం వెంటనే నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యకర్తలను బుజ్జగిస్తున్నారు. సీట్ల సర్దుబాట్లపై మరోసారి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎల్‌ రమణతో కోదండరాం భేటీ కానున్నారు. నాంపల్లిలోని టీజేఎస్‌ కార్యాలయంలో వీరు సమావేశం కానున్నారు.

సీట్లపై క్లారిటీ..
మహాకూటమి సీట్ల సర్దుబాటు అంశం చివరి దశకు చేరింది. నాంపల్లిలోని టీజేఎస్‌ కార్యాలయంలో కోదండరాం, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఎల్‌ రమణ భేటీ అయ్యారు. మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చాడ వెంకట్‌రెడ్డితో ఏఐసీసీ కార్యదర్శి పాల్గొన్నారు. ఈరోజు రాత్రి వరకు సీట్ల విషయం తెల్చాలని సీపీఐ, టీజేఎస్‌ డిమాండ్‌ చేస్తున్నాయి. సీట్లపై క్లారిటీ ఇవ్వని పక్షంలో తాము వేరు కుంపటి పెట్టుకుంటామని భాగస్వామ్య పార్టీలు తేల్చిచెప్పడంతో కాంగ్రెస్‌ వేగం పెంచింది. దీంతో సీట్ల విషయం తుది దశకు చేరుకుందని కూటమి నేతలు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు