సమ్మెకు సపోర్ట్‌

16 Oct, 2019 03:36 IST|Sakshi
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలుపుతున్న టీఎన్‌జీవో, టీజీవో నేతలు

ఆర్టీసీ కార్మికులకు టీఎన్‌జీవో, టీజీవోల మద్దతు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఎన్‌ జీవో, టీజీవో సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మద్దతు ప్రకటిం చేందుకు సిద్ధమైంది. బుధవారం జరిగే జేఏసీ సమావేశంలో చర్చించి ప్రకటన చేయనుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించినట్లవుతుంది. మంగళవారం టీఎన్‌జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశ జరిగింది. అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వ త్థామరెడ్డి, రాజిరెడ్డి, సుధ, ఎస్‌వీ రావు తదితరు లు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ కారెం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ మమత ఇతర నేతలతో చర్చించారు. తర్వాత రవీందర్‌రెడ్డి, మమత ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించారు. జేఏసీ కార్యాచర ణను బుధవారం ప్రకటిస్తామని తెలిపారు.

రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పది రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెలో అన్ని వర్గాలు పాల్గొంటున్నాయన్నారు. ఆర్టీసీ జేఏసీ వస్తేనే మద్దతు ఇవ్వాలని కిందిస్థాయి నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఆగామన్నారు. అయితే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు మరణించిన సంఘటన తమను కలచివేసిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు వచ్చే జీతాలు చాలా తక్కువ, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలో అడిగామన్నారు. ఆర్టీసీ సమ్మెను చూసి అదే మార్గంలో వెళ్లాలని ఇతర ఉద్యోగ సంఘాలు ముందుకు వస్తున్నాయన్నారు. ఇలాగే అయితే మరో సకల జనుల సమ్మెకు సిద్ధమయ్యే పరిస్థితి వస్తుందని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెప్ప డమే లక్ష్యంగా ముందుకు వెళతామన్నారు.

టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. ఏ రంగం లోని ఉద్యోగులు అయినా ఒకటేనని, అంతా తమ సోదరులేనన్న భావనను తెలంగాణ ఉద్యమం నేర్పించిందన్నారు. అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం వచ్చాక పురోగమించాల్సిన ఆర్టీసీ తిరో గమనంలో పడిందన్నారు. రాష్ట్రం రాకముందు 1,200 గ్రామాల్లో బస్సు సౌకర్యం లేదన్నారు. రాష్ట్రం వస్తే గ్రామగ్రామాన బస్సు తిప్పుతామని చెప్పామన్నారు. ఇప్పుడు 3,000 గ్రామాలకు బస్సులే లేకుండాపోయాయన్నారు. అర్బన్‌ లాసెస్‌ను చట్టం తెచ్చి ఇస్తామని సీఎం చెప్పినా రూ. 1,400 కోట్లు రాలేదన్నారు. రూ.210 కోట్లు బ్యాంకు గ్యారంటీకి సంబంధించి రావాల్సినవి రాలేదన్నారు.

సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితిలోనే సమ్మె నోటీసు ఇచ్చామని చెప్పారు. చాలా వరకు ఆర్టీసీ ఆస్తులను అమ్మేశారని, మిగిలిన వాటినైనా కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభు త్వం మాట్లాడిన తీరు కార్మికులను కలచివేసిం దన్నారు. ఇంత జరుగుతున్నా స్ఫూర్తిగా నిలవా ల్సిన టీజీవో, టీఎన్‌జీవోలు ఎందుకు స్పందిం చడం లేదని కొన్ని మాటలు అన్నా.. అందుకు చింతిస్తున్నామన్నారు. యాజమాన్యం సీఎంతో మాట్లాడి కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని కోర్టు చెప్పిందన్నారు. యూనియన్‌గా తమను కూడా చర్చలకు వెళ్లమని తమ అడ్వొకేట్‌ సూచించారన్నారు. చర్చల ఫలితాల మేరకు ముందుకు సాగుతామని వెల్లడించారు. 

టీఎన్‌జీవో.. ప్రధాన తీర్మానాలివే..
►ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రస్తుతం సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలుపుతున్నాం.
►సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థానం లో విధులు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఉత్తర్వు లను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. 
►పీఆర్‌సీ మంజూరు, సీపీఎస్‌ రద్దు, పదవీ విరమణ వయసు పెంపు, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్‌ మంజూరు తదితర 15 సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.

మరిన్ని వార్తలు