ఎవరి మాటలు నమ్మాలి?

3 Jun, 2016 02:24 IST|Sakshi
ఎవరి మాటలు నమ్మాలి?

హుస్నాబాద్ జిల్లా కోసం డప్పు దరువు

హుస్నాబాద్ :  హుస్నాబాద్ జిల్లా అయ్యే అవకాశాలున్నాయని ఎంపీ వినోద్‌కుమార్ చెబుతుంటే.. మరోవైపు హుస్నాబాద్ మండలం సిద్దిపేట జిల్లాలో కలువనుందని సీఎం కేసీఆర్ మాటలు నమ్మాలో అర్థం కావడం లేదని హుస్నాబాద్ జిల్లా సాధన సమితి నాయకులు అన్నారు. హుస్నాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గురువారం పట్టణంలో డ ప్పు దరువుతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సాధన సమితి నాయకులు మాట్లాతుతూ ఇన్ని రోజులు హుస్నాబాద్ జిల్లా విషయంలో రోజుకొక ప్రచారం జరిగినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన వైఖరి కోసం ఎదురు చూశామన్నారు. తీరా హుస్నాబాద్ మండలాన్ని సిద్దిపేటలో కలిపే యోచనలో ఉన్నట్లు సీఎం చెప్పడం ఈ ప్రాంత ప్రజలు అందోళనకు గురిచేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా కోసం హుస్నాబాద్‌ను చేయడంపై ప్రశ్నించారు.

వారం రోజులుగా హుస్నాబాద్ జిల్లా కోసం  చేస్తున్న ఆందోళనలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, హుస్నాబాద్ జిల్లా సాధన సమితి కన్వీనర్ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, కో-కన్వీనర్లు వడ్డెపల్లి వెంకటరమణ, దొడ్డి శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు బొల్లి శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, పచ్చిమట్ల రవీందర్, అక్కు శ్రీనివాస్, వాల నవీన్, మాడిశెట్టి శ్రీధర్, మైల కొమురయ్య, వడ్డెపల్లి మల్లేశం పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు