వంతెన పనులు వేగవంతం చేయూలి

20 May, 2016 02:09 IST|Sakshi
వంతెన పనులు వేగవంతం చేయూలి

తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ
ఇంజినీరింగ్ చీఫ్ రవీందర్‌రావు

 
 
 లోకేశ్వరం : పంచగుడి వంతెన నిర్మాణం పనులు వేగవతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ ఇంజినిరింగ్ చీఫ్ రవీందర్‌రావు అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాలను కలిపేందుకు పంచగుడి గ్రామ సమీపంలోని గోదావరిలో జరుగుతున్న వంతెన పిల్లర్ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు త్వరగా పూర్తి చేయూలన్నారు. రెండు మూడు రోజుల్లో గోదావరి నదిలో వంతెన పనులను ప్రారంభించాలన్నారు. నదిలో వేసిన చిన్న పిల్లర్లను కొలతలు తీసి మార్కింగ్ వేశారు.

ఈ వంతెన నిర్మాణం పూర్తరుుతే నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్ గ్రామం నుంచి నిజామాబాద్ వెళ్లేందుకు దగ్గరవుతుందని తెలిఆపరు. ప్రజలు, ముథోల్ నియోజకవర్గం ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ప్రభుత్వం రూ.90 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులు సరిపోకపోతే మళ్లీ  ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఆయన వెంట ఆదిలాబాద్, నిజామాబాద్ ఆర్‌ఆడ్‌బీ ఎస్సీలు రాజిరెడ్డి, మధుసూదన్, ఈఈ రమేశ్, డీఈ రవీందర్‌రెడ్డి, వంతెన కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డి, నాయకులు గంగాధర్, లచ్చారెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు