సేంద్రియ సాగుకు ప్రోత్సాహం

28 Jan, 2017 01:41 IST|Sakshi
సేంద్రియ సాగుకు ప్రోత్సాహం

వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ సంస్థ విభాగం ప్రారంభం


హైదరాబాద్‌: ఆహార ధాన్యాల కొరత రానీయకుండా చర్యలు తీసుకుంటూనే రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రోత్సహి స్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే రైతులకు పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. శుక్రవారం ఇక్కడ హాకా భవనంలో తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ సంస్థ విభాగాన్ని పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  రాష్ట్రం లో ఎక్కడ సేంద్రియ సాగు చేస్తున్నట్లు తెలి సినా స్వయంగా ఆ రైతుల వ్యవసాయ క్షేత్రా లను సందర్శించి వారి వివరాలు తెలుసుకుం టున్నట్లు చెప్పారు. సేంద్రియ సాగు ప్రారంభించిన మొదటి రెండేళ్లు దిగుబడి తగ్గి రైతులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పద న్నారు. మూడో ఏడాది నుంచి దిగుబడి పెరగడంతోపాటు ఆరోగ్యకరమైన ఉత్పత్తి వస్తుందని పేర్కొన్నారు. సేంద్రియ ఎరువు లతో పండించిన ఆహారోత్పత్తులు వాడుతు న్న ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన ఉత్పత్తులకు మార్కె ట్‌ సదుపాయం కల్పిం చాలని రైతుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు.

ఆరోగ్యం కోసం కోట్ల నిధులు ఖర్చు..
దిగుబడి పెంచాలన్న లక్ష్యంతో రైతులు అడ్డగోలుగా వాడుతున్న రసాయన ఎరువు లు, పురుగు మందులతో ఆహార ఉత్పత్తుల న్నీ కలుషితమవుతున్నాయన్నారు. మారుతు న్న జీవన విధానాలతో గాలి, నీరు కలుషితం అవుతోందని.. తినే ఆహార పదార్థాల్లో రసాయన అవశేషాలు ఉండడంతో రోగాల పాలు కావాల్సి వస్తోందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే హైదరాబాద్‌లో ఏ ఆసుపత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితి మారాలంటే సేంద్రియ సాగు ఒక్కటే పరిష్కారమన్నారు. ప్రజా రోగ్యం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తోందన్నారు. ప్రతీ పంట కాలనీల్లోని 50 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ధ్రువీకరణతో సేంద్రియ రైతులు పండించే ఉత్ప త్తులకు మంచి ధర రానుందన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి మాట్లాడుతూ సేంద్రియ సాగు పెంచేలా ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. సేంద్రియ ఆహార పంటలకు ప్రత్యేకంగా కనీస మద్దతు ధర నిర్ణయించాలని తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులపై అవగాహన పోస్టర్, కరపత్రాలు, సీడీని మంత్రి ఆవిష్కరించారు.  

సేంద్రియ సాగులో రైతులకు ఓపిక ఉండాలి
సేంద్రియ సాగు ప్రారంభించిన మొదటి మూడేళ్లు దిగుబడి తగ్గినా క్రమంగా లాభదా యకంగా ఉంటుందని పలువురు రైతులు వివరించారు. సేంద్రీయ పద్ధతుల్లో తాము సాగుచేస్తున్న పంటలకు సంబంధించిన ఇబ్బందులు, దిగుబడులు తదితర వివరా లను వారు పంచుకున్నారు. నిజామాబాద్‌ లోని సుభాష్‌నగర్‌కి చెందిన రైతు వెంకట్‌రెడ్డి తాను పచ్చిరొట్ట ఎరువుతో సాగు చేసి ఎకరానికి 35 బస్తాల వడ్లు పండించినట్లు తెలిపారు.  ఆర్గానిక్‌ ఉత్పత్తులకు ధ్రువీకరణ రావడంతో తమకు భరోసా పెరిగినట్లు రైతులు తెలిపారు.

మరిన్ని వార్తలు