నేడు 108 పెలైట్స్ డే

26 May, 2014 00:51 IST|Sakshi

కోటపల్లి, న్యూస్‌లైన్ : అత్యవసర పరిస్థితి ఎదురైనపుడు మెరు పు వేగంతో సంఘటన స్థలానికి నవ సంజీవనీని తీసుకెళ్తారు. విధి నిర్వహణలో ముందుండి ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ అతి త్వరగా ఆస్పత్రుల్లో చేర్చుతారు. వారికి ఏమీ కాకూడదని కోరుకుంటారు. సోమవారం ‘108 పెలైట్స్ డే’ సందర్భంగా పైలట్స్ అంది స్తున్న సేవలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం.  

 సేవలకు గుర్తింపుగా పెలైట్స్ డే..
 108 అంబులెన్స్‌కు మొదటి ప్రాణం ఈఎంటీ ఐతే రెండో ప్రాణం పెలైట్. ఎలాంటి విపత్తు ఎ దురైనా ఈఎంటీ తక్షణమే స్పందిస్తారు. ప్రమా ద బాధితులకు వైద్య చికిత్స అందించి వారిని కాపాడేందుకు కృషి చేస్తారు. క్షణ కాలాన్ని కూ డా వృథా కానివ్వకుండా అత్యవసర సర్వీసైన 108 అంబులెన్స్‌ను సంఘటన స్థలానికి తీసుకెళ్లడం పెలైట్ బాధ్యత. అందుకే వీరిరువురు 108కు రెండు కళ్లలాంటివారిగా ఆ విభాగం ఉ న్నతాధికారులు బావిస్తుంటారు. అలాంటి వారి సేవలకు గుర్తింపునిచ్చేందుకు ప్రతీ సంవత్సరం మే26న 108 పెలైట్స్ డే జరుపుతుంటారు.
 
 బాధితులకు ఆప్తులుగా..
 108 అంబులెన్స్ సమయానికి సంఘటన స్థలానికి చేరడం, అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లడంలో ప్రతీ క్షణం విలువైందే. ప్రతీ క్షణానికి విలువని స్తూ 108 అంబులెన్స్ సేవలను ప్రతీ ఒక్కరికి తె లియపరుస్తున్న సిబ్బంది ప్రతీ ఒక్కరికి ఆప్తులే. పెలైట్ ఆపద సమయంలో వేగంతో వెళ్తున్నపు డు అంబులెన్స్‌లో ఉన్నవారితో పాటు రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులకు ఎలాంటి ఆపద కలగకుండా వ్యవహరిం చాల్సి ఉంటుంది.

ఈ విషయంలో ఏమాత్రం ని ర్లక్ష్యం ప్రదర్శించినా ఇద్దరి ప్రాణాలకు అపాయ మే. అంతేకాకుండా అత్యవసర సమయంలో ఈఎంటీలకు సహాయం చేసేందుకు పెలైట్లకు ప్రథమ చికిత్స నిర్వహించే విధానంపై కూడా శి క్షణ ఇస్తారు. దీంతో ఈఎంటీలకు ప్రథమ చికి త్స సమయంలో పెలైట్లు చేదోడువాదోడుగా ఉంటారు. పెలైట్ల సేవల గుర్తింపు కోసం వారికి ఒక రోజును కేటాయించి ప్రతిభ కనబరిచిన పెలైట్లను 108 అధికారులు సత్కరిస్తుంటారు.

మరిన్ని వార్తలు