ఉద్యమవీరునికి జేజేలు

16 Feb, 2015 23:52 IST|Sakshi
ఉద్యమవీరునికి జేజేలు

నేడు ముఖ్యమంత్రి జన్మదినం
కేసీఆర్ ఇలాకా.. ఆనందహేల
రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువుగా గజ్వేల్
ప్రగతివైపు పరుగులు
సంబరాలకు సిద్ధమవుతున్న పార్టీ యంత్రాంగం
ఎమ్మెల్యేల శుభాకాంక్షలు


గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15సార్లు జరిగిన ఎన్నికల్లో 1989, 2004 ప్రాంతంలో డాక్టర్ జె.గీతారెడ్డి మంత్రి పదవులను దక్కించుకోగా మిగతా వారంతా ఎమ్మెల్యేలుగానే కొనసాగారు. తాజాగా కేసీఆర్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో సాదాసీదా నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో అగ్రతాంబూలాన్ని అందుకుంది. సీఎం కొత్త తరహా ఆలోచనలకు నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి శివారులోని ఫాంహౌస్ కేంద్రబిందువుగా మారడం. ఈ దశలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరోవైపు ‘కొత్త రాష్ట్రం-కొత్త నాయకత్వం-సరికొత్త పంథా’ పేరిట తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ సిద్ధమవుతున్న తరుణంలో ఆయన సొంత నియోజకవర్గం కావడం వల్ల సహజంగానే ఈ లక్ష్యానికి ఈ ప్రాంతమే కేంద్ర బిందువుగా మారింది.
 
గజ్వేల్‌లో అభివృద్ధి ఇలా..

గజ్వేల్ చుట్టూ రింగు రోడ్డు ఏర్పాటుకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటికే స్థల సేకరణకు నిధులు మంజూరు చేశారు. అదేవిధంగా గజ్వేల్ నగర పంచాయతీలో శాశ్వత దాహార్తి నివారణకు ‘గోదావరి సుజల స్రవంతి పథకం’ కోసం రూ. 60కోట్లకుపైగా నిధులి చ్చారు. గజ్వేల్‌లో 5వేల మంది పేదలకు ఇళ్లస్థలాలు, గృహనిర్మాణానికి కార్యాచరణకు అధికారులను ఆదేశిం చారు. ఆర్‌అండ్‌బీ, పీఆర్‌రోడ్ల అభివృద్ధికి విరివిగా నిధులు మంజూరు చేశారు. ములుగులో హార్టికల్చర్ యూనివర్శిటీ, ఫారెస్ట్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. గజ్వేల్ మిల్క్‌గ్రిడ్ పథకానికి ఇప్పటికే అంకురార్పణ జరిగింది.

గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి మండల కేంద్రాలు, పంచాయతీలు, మధిరగ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి విరివిగా నిధులిచ్చారు. గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచగా,  తూప్రాన్ ప్రభుత్వాసుపత్రిని 50 పడకలుగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ ప్రారంభమైంది. అభివృద్ధి పవర్‌డే నిర్వహణ, మిషన్ కాకతీయ కింద 606 చెరువుల అభివృద్ధికి నిర్ణయం, గజ్వేల్ నియోజకవర్గంలో కొత్తగా 220కేవీ, ఒక 132, మరో ఆరు 33/11కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇవే కాకుండా పలు ప్రతిష్టాత్మక పథకాలకు సైతం గజ్వేల్‌ను పెలైట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. ఇదిలావుంటే మంగళవారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సంబరాలు జరుపుకోవడానికి పార్టీ యంత్రాంగం సిద్ధమవుతోంది.
 
కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

సాక్షి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధించిన అనంతరం తొలి జన్మదినోత్సవాన్ని మంగళవారం జరుపుకోనున్నారు. సీఎంకు మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ మరింత ముందు కు సాగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని వారి మనోభావాలు వారి మాటల్లోనే...
 
ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా ముందుకు:
హరీష్‌రావు, నీటిపారుదలశాఖా మంత్రి

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుంది. సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు జిల్లాల్లో 1.20 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేస్తాం. మిషన్ కాకతీయను యజ్ఞంలా నిర్వహించి చెరువు, కుంటలకు గత వైభవాన్ని తీసుకొస్తాం. చెరు వు కుంటల నుంచి తరలించిన మట్టితో రైతుల వ్యవసాయ భూముల్లో భూ సారాన్ని పెంచుతాం. వాటర్‌గ్రిడ్ పథకాన్ని విజయవంతం చేసి ప్రతి ఇంటికి నీరందిస్తాం.
 
కేసీఆర్‌తో సుపరిపాలన
చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే సంగారెడ్డి

శివరాత్రి పర్వదినంతోపాటు కేసీఆర్ జన్మదినం కలిసిరావటం ఆనందంగా ఉంది. తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ సుపరిపాలన అందజేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేరుస్తారు. ఆయన సారధ్యంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం అవుదాం.
 
తెలంగాణ పోరాట యోధుడు
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి

తెలంగాణ పోరాట యోధు డు కేసీఆర్. నాలుగున్నర కోట్ల ప్రజల్లో ఉద్యమ స్ఫూ ర్తిని రగిలించి..పన్నెండేళ్ల అలుపెరగని పోరాటంతో సమైక్య పాలనను సమాధిచేసి...తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. నిరుపేదలు, ఉద్యోగులు, మహిళల అభ్యున్నతికోసం ప్రవేశ పెట్టిన పథకాలు భేష్‌గా ఉన్నాయి. ఏడుపాయల జాతరకు కోటి రూపాయలు మంజూరు చేయడం గర్వకారణం. దుర్గమ్మతల్లికి మంగళవారం ఏడుపాయల్లో ప్రత్యేక పూజలు చేయిస్తాం.
 
బంగారు తెలంగాణ సాధించాలి:
చిలుముల మధన్‌రెడ్డి,ఎమ్మెల్యే నర్సాపూర్

కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండి బంగారు తెలంగాణ సాధిం చాలని కోరుకుం టున్నా. పేదల సంక్షేమం కేసీఆర్ తోనే సాధ్యం. వాటర్‌గ్రిడ్ పథకాన్ని సీఎం మానస పుత్రికగా చేపడుతున్నారు. పథకం పూర్తయితే ఇంటింటికీ మంచినీరు అందుతుంది. సీఎం సహకారంతో నర్సాపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.
 
మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్
జోగిపేట: సీఎం సాధించబోయే బంగారు తెలంగాణకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. లక్షలాది మందికి అన్నం పెట్టే ఆయనకు తెలంగాణ ప్రజలంతా ఆశీస్సులు అందజేయాల్సిన అవసరం ఉంది. 22 సంవత్సరాలుగా  సీఎం కేసీఆర్ గూర్చి తెలిసిన వాడిగా ఆయన తెలంగాణ మహాత్మాగాంధీ. స్నేహశీలి భావాలు కల్గి ఉన్నవాడు. ఆడంబరాలకు దూరంగే ఉండే ఆ మహానుభావుడికి భగవంతుడు అన్నివిధాలా సహకరించాలి.
 అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలి:
 
జడ్పీ చైర్‌పర్సన్ రాజమణి

చంద్రశేఖరరావు దేశంలోనే అగ్రగామి సీఎంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నా.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ హయాం లో అన్ని రంగాల్లో  రాష్ట్రం అభివృద్ధి చెంది దేశంలోనే  తెలంగాణ రాష్ట్రం  ఉన్నత స్థాయిలో ఉండగలదని నా ఆశాభావం.

మరిన్ని వార్తలు