నేడు పింఛన్ పంపిణీ డౌటే !

5 Jan, 2015 03:29 IST|Sakshi

ప్రగతినగర్ : ‘ఆసరా’ పింఛన్లు ఈ నెల 5 నుంచిఅందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ రేమండ్ పీటర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సోమవారం నుంచి పింఛన్ల పంపిణీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. సాంకేతిక కారణాల వల్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.‘ఆసరా’కు సంబంధించిన నిధులు ఇప్పటికీ సెర్ప్ నుంచి డీఆర్‌డీఏ అకౌంట్‌లో జమ కాలేదు.

నిధులు డీఆర్‌డీఏ అకౌంట్‌లో జమైన అనంతరం ఎంపీడీఓ అకౌంట్‌లోకి పింఛన్ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. ఎంపీడీఓ ఆయా గ్రామ కార్యదర్శుల ద్వారా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందిస్తారు. అయితే ఈ ప్రక్రియకు మరో రెండు రోజులు సమయం పటేలా ఉందని సంబంధిత అధికారికి వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెలలో రెండు నెలల పింఛన్ కలిపి 2,01,982 మందికి రూ. 42 కోట్ల 54 లక్షలు పంపిణీ చేశారు.
 
రూపాయల వరకు అందించారు. గత నెలతో పోలిస్తే జనవరి నెల పింఛన్ పెరిగింది. ఈ నెలలో నిజామాబాద్ అర్బన్‌లో 11,244 మందికి పింఛన్ అందించనున్నారు.మరో రెండు రోజుల్లో ఈ సంఖ్య మరో వెయ్యి వరకు పెరిగే ఆస్కారం ఉంది.అంతే కాకుండా నిజామాబాద్ మూడు మున్సిపాలిటీలు,అన్ని మండలాలు కలిపి జనవరి నెలకు 2,07,984 మందికి పింఛన్ అందించడానికి అధికారులు సిద్ధమయ్యారు.

వీటికి గాను 23 కోట్ల రుపాయలు పింఛన్  పంపిణీ చేయనున్నారు. అయితే నిజామాబాద్ అర్బన్‌లో గత నెలలో అప్‌లోడ్ సీడింగ్ సాంకేతిక సమస్యల వల్ల చాలా మంది లబ్ధిదారులకు పింఛన్ అందని విషయం తెలిసిందే.అర్బన్ పింఛన్‌పై గత నెలలో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యే సరికి జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ రంగంలోకి దిగి మున్సిపాల్ అధికారులతో తిరిగి అర్బన్ డాటాను సేకరించారు.

వాటిని వెంటనే అప్‌లోడ్ చేయించి సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది అర్హులకు పింఛన్ అందేలా ప్రయత్నించారు. కలెక్టర్ ప్రయత్నం మూలంగా అర్బన్‌లో డిసెంబర్ నెలతో పోల్చుకుంటే దాదాపు మరో 5 వేల మంది  లబ్ధిదారులు పెరగనున్నారు. డిసెంబర్‌లో నిజామాబాద్ అర్బన్ 9,634 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ మంజూరు కాగా 8,576 మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు