తుది తీర్పునకు లోబడే.. 

30 Jun, 2019 03:24 IST|Sakshi

నేడు తెలుగు నిర్మాతల మండలి ఎన్నిక 

మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు నిర్మాతల మండలి ఎన్నిక తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 2019–21 సంవత్సరానికి తెలుగు నిర్మాతల మండలికి జరుగుతున్న ఎన్నికల్లో కోశాధికారి పోస్టుకు తాను దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ యలమంచిలి రవిచంద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది జె.విజయలక్ష్మి వాదనలు వినిపిస్తూ చదలవాడ శ్రీనివాసరావును ఏకగ్రీవం చేసేందుకే పిటిషనర్‌ నామినేషన్‌ను తిరస్కరించారని తెలిపారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. కోశాధికారి పోస్టుకు పిటిషనర్‌ పేరును వైవీఎస్‌ చౌదరి ప్రతిపాదించారని, ఆ తరువాత ఆయనే నామినేషన్‌ దాఖలు చేయడంతో పిటిషనర్‌ నామినేషన్‌ను తిరస్కరించారని వివరించారు.

పిటిషనర్‌తోపాటు వైవీఎస్‌ చౌదరి, రామ సత్యనారాయణ, చదలవాడ శ్రీనివాసరావులు నామినేషన్‌లు దాఖలు చేశారని, పిటిషనర్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురికాగా, వైవీఎస్‌ చౌదరి, రామ సత్యనారాయణ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, బరిలో శ్రీనివాసరావు ఒక్కరే మిగిలారన్నారు. ఆయన కోసమే ఇదంతా చేశారని వివరించారు. వైవీఎస్‌ చౌదరి ఉపాధ్య పదవికి పోటీ చేస్తున్నారని, ఈ కుట్ర కోణాన్ని పరిగణనలోకి తీసుకుని తన నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నెల 30న(నేడు) జరగనున్న నిర్మాతల మండలి ఎన్నిక ఈ వ్యాజ్యంలో కోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటుందని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువకులు

బైకుల దొంగ అరెస్ట్‌

కేఎంసీ వర్సెస్‌ ఎంజీఎం 

'మస్ట్‌'బిన్‌ లేకుంటే జరిమానాల దరువు

కొత్తపట్నం ఏర్పాటు ఇలా..

నీళ్లు ఫుల్‌

నగరంలోకి ఎలక్ర్టికల్‌ బస్సులు

వివాహేతర సంబంధం పెట్టుకుందని..

ద.మ.రై.. వంద రైళ్ల వేగం పెంపు..

అణచి వేసేందుకే మావోయిస్టు ముద్ర

చదువుతో పాటు.. ఉద్యోగం

మత మార్పిడి చేసిన మదర్సా నిర్వాహకుల అరెస్ట్‌

ఎట్టకేలకు ఒక్కటైన ప్రేమికులు

అత్తను చంపిన కోడలు అరెస్ట్‌

వైద్యం అందక చిన్నారి మృతి

ఎడ్లబండే 108 

గుట్టుచప్పుడు కాకుండా ..

వీళ్లు ఇక మారరు..

ఇల్లు కూలుస్తుండగా పురాతన విగ్రహాలు, పూజా సామగ్రి లభ్యం

వేలిముద్రతో ‘వెరీ ఫాస్ట్‌’

మూతపడుతున్న ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు

కనుచూపు మేర కనిపించని ‘కిరోసిన్‌ ఫ్రీ సిటీ’

వయసు 20.. బరువు 80..

మహిళలను వేధిస్తే ఊర్లో ఉండనివ్వం..

సరిహద్దుల్లో చేతివాటం!

పార్టీని మీరే కాపాడాలి : సోనియా

2,166 మందిపై అనర్హత వేటు

ఎన్‌ఆర్‌ఐ మహిళలు మరింత సేఫ్‌

ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు సబబే

దసరా నాటికి పార్టీ జిల్లా ఆఫీసులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..