కొండంతా కాషాయం

14 Apr, 2014 02:17 IST|Sakshi
కాలినడకన కొండగట్టుకు చేరుకుంటున్న దీక్షాపరులు

 నేడు హనుమాన్ జయంతి
మూడు రోజుల పాటు ఉత్సవాలు ముమ్మరమైన ఏర్పాట్లు
కొండగట్టుకు చేరుకుంటున్న దీక్షాపరులు

 
 మల్యాల, న్యూస్‌లైన్:  కొండగట్టు గిరులు కాషాయ వర్ణమవుతున్నాయి. హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు దీక్షాపరులు కొండకు చేరుకుంటున్నారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా జరగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాక నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తర లి రానున్నారు. ఇప్పటికే వేలాది మంది హనుమాన్ దీక్షాపరులు వారం రోజులగా కొండగట్టుకు వస్తూ  దీక్షలను శ్రీస్వామివారి సన్నిధానంలో విరమిస్తున్నారు. మూడు రోజుల పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్యలతో పాటు క్యూలైన్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుం టున్నారు.

ఆదివారం జగిత్యాల రూరల్ సీఐ వెంకటరమణ కొండగట్టుకు వచ్చి వసతులను పరిశీలించారు. ఘాట్‌రోడ్డును వన్‌వేగా మార్చడంతో పాటు ఆలయంలో మూడు రోజుల పాటు ఎలాంటి ఆర్జిత సేవలు ఉండబోవని ఈ వో గజరాజు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుం టున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు