ఈ తిప్పలు తప్పేదెన్నడో?

3 Dec, 2014 02:27 IST|Sakshi

నేడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం
     
ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల (వికలాంగులు) సమస్యలు పరిష్కారం కావడం లేదు. 2009లో అమలులోకి వచ్చిన విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి వీరికి సాధారణ తరగతి గదులలో మిగతా విద్యార్థులతోపాటే ప్రత్యేక శిక్షకుల ద్వారా (సమ్మిళిత విద్య) విద్యాబోధన చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ చట్టం అమలుకు నోచుకోలేదు. వైకల్యంతో జన్మించిన తమ పిల్లలకు కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా పాఠశాల విద్య అందుతుందేమోనని ఎదురు చూసిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తోంది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య తన డ్రీమ్ ప్రాజెక్టు అంటూ పలు మార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందుకు ప్రణాళిక సైతం రూపొందిం చుకొని ముందుకు సాగుతున్నారు. కా నీ అవే ప్రభుత్వ పాఠశాలలలో నిరాద రణకు గురవుతున్న తమ పిల్లల గురిం చి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

ఐదేళ్లవుతున్నా ప్రచార ఆర్భాటమే

విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చి ఐదేళ్లవుతున్నా అందరికీ విద్య అనే నినాదం ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతోంది. వైకల్య పిల్లలకు విద్యనందించడానికి అంకిత భావంతో స్పెషల్ ఎడ్యూకేషన్ చదివినవారు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. దైనందిన కార్యక్రమాలు చేసుకోవడంలో ఇబ్బం దులు ఎదుర్కొనేవారిని వికలాంగులు గా (ప్రత్యేక అవసరాలు గలవారిగా) గుర్తిస్తారు. 2014-15 విద్యా సంవత్సరంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, సర్వశిక్షా అభియాన్ సంయుక్తంగా ఇంటింటి సర్వే నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలలో 1.50 లక్షలకు పైగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్న    ట్లు గుర్తించారు. వారిలో సుమారు 69 వేల మంది విద్యార్థులు పాఠశాలలలో ఉంటే మిగతావారు పాఠశాలల బయ ట ఉన్నట్లు తేలింది. సాధారణ పాఠ శాలలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఎలా బోధించాలో అక్కడి ఉపాధ్యాయులకు తెలియదు. దీంతో చాలా మంది పిల్లలు బడి మానేస్తున్నారని నిర్ధారించారు. వైకల్య బాలలకు ప్రత్యేక విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయు  లు మాత్రమే బోధించడానికి అర్హులని గతంలో భారత పునరావాస మండలి తీర్మానించింది.

కేవలం ఏడు పాఠశాలలే

వాస్తవాలు మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 1.50 లక్షల మం  ది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కేవలం ఏడు పాఠశాలలనే ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో బధిరులకు మిర్యాలగూడ, కరీంనగర్, హైదరాబాద్‌లో నాలుగు పాఠశాలలు ఉన్నాయి. అంధులకు మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్‌లో కలిపి మూడు పాఠశాలలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలు ఎక్కడా అందుబాటులో లేవు. ఏటా ఉద్యోగ నియామకాలలో మూడు శాతం రిజర్వేషన్‌ను వికలాంగుల కోసం కేటాయిస్తుంటారు.

చదువుకోవడానికి విద్యా సంస్థలే అందుబాటులో లేని పరిస్థితులలో వారు ఉద్యోగం పొం దే స్థాయికి ఎప్పుడు వెళ్తారో ప్రభుత్వాలే ఆలోచించాలి. జిల్లాలో 8,603 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. ప్రతీ ఐదుగురు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఒక ప్ర త్యేక ఉపాధ్యాయుడు అవసరం ఉండగా, సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో కేవలం 42 మందిని కాంట్రాక్టు రిసోర్స్‌పర్సన్‌లను నియమించి బోధన అందిస్తున్నారు.

మోక్షం లేని ప్రత్యేక పాఠశాలలు

సాధారణ విద్యార్థుల కోసం కిలోమీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాల అన్న ప్రభుత్వం నిర్ణయం హర్షించదగ్గదే. అయితే, అడుగు తీసి అడుగు వేయలేని ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య కోసం కనీసం ప్రతీ వంద కిలో మీ టర్లకు ఒక ప్రత్యేక పాఠశాలనైనా ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుం చి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికి ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వం అందజేయాల్సి ఉంటుంది. ప్రత్యే  క అవసరాలు గల పిల్లలకు బోధించడానికి జిల్లావ్యాప్తంగా ఒక్క రెగ్యులర్ ఉపాధ్యాయుడు కూడా లేడు. ఒక్క ప్ర భుత్వ ప్రత్యేక పాఠశాల లేదు. దీంతో ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రుల సంఘం ఆధర్వం లో గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. అది విచారణలో ఉంది. ఇప్పటికైనా ఈ పిల్లలకు, తల్లిదండ్రు లకు న్యాయం చేకూరుతుందా!

మరిన్ని వార్తలు