కోరలుచాచిన కాలుష్యం

5 Jun, 2015 05:55 IST|Sakshi
కోరలుచాచిన కాలుష్యం

- తీవ్రమైన చెట్ల నరికివేత
- నీటి సంరక్షణ, మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం
- అడుగంటుతున్న భూగర్భ జలాలు
- ‘పర్యావరణం’పై అవగాహనే కీలకం
- నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పర్యావరణ పరిరక్షణ.. ఇది అందరి బాధ్యత.. దీనిపై విస్త­ృతంగా అవగాహన కల్పించాలి.. చెట్లు నరకడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాలు కురవకపోవడం.. భూగర్భ జలాలు అడుగంటడం.. ఆరోగ్య సమస్యలు తలెత్తడం.. భవిష్యత్ తరాలకు ఎదురయ్యే ఇబ్బందులు.. వీటన్నింటిపై ముందస్తుగా వివరిస్తే కొంత మేలు చేసినట్లవుతుంది.. ఆ దశగా ప్రతి ఒక్కరు అడుగు ముందుకు వేయూలి.. నగరాలు, గ్రామాల్లో మొక్కలు విరివిగా పెంచడం.. వాటిని కాపాడడం బాధ్యతగా తీసుకోవాలి.. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం...
 - వరంగల్ అర్బన్/మహబూబాబాద్ రూరల్ :
 
పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ఏదో ఒక నగరంలో అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. ఇందులో పర్యావరణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొంది స్తుం టారు. 1972లో స్థాపించబడిన ‘ఐక్యరాజ్యసమితి పర్యావరణ పథకం’ ఇదే నివేదికను ఉపయోగించుకుని పర్యావరణానికి సంబంధించి.. రాజకీయవాదులను, ప్రజలను అప్రమత్తం చేసే దిశగా తగిన చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఆధునిక పోకడలు పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతినడం వల్ల భవిష్యత్ తరాలకు శాపంగా మారనుంది.

పల్లెలు, గ్రామాలను వదిలి పట్టణాలకు, నగరాలకు వలసలు పెరుగుతున్నాయి. ఏటా ఈ శాతం వృద్ధి చెందుతుండటంతో పట్టణాలు, నగరాలపై ఒత్తిడి ఎక్కువవుతోంది. ఆవాసాలకు అవసరమైన స్థలాల కోసం పచ్చని చెట్లను నరికేస్తున్నారు. చెరువులు, కుంటలను ఆక్రమిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. వాహనాల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతుండటంతో కాలుష్య భూతం ప్రజలను భయపెడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో పట్టణాలు, నగరాల్లో జీవనం దుర్భరంగా మారుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాల ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం వెరసి పట్టణాలు, నగరాల్లో పర్యావరణానికి తూట్లు పడుతున్నారు.

పర్యావరణంపై పట్టింపు కరువు
పర్యావరణం కలుషితం కావడం వల్ల ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నాయి. చెత్త చెదారాన్ని ఎక్కడపడితే అక్కడ కాల్చివేస్తుండటంతో  వెలువడుతున్న పోగతో శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు. వాతావరణానికి విఘాతం కలుగుతోంది.

పడిపోతున్న భూగర్భ జలాలు
నగరంలో అపార్టుమెంట్ సంస్కృతి పెరగడంతో బోరుబావుల నుంచి భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరిగింది. కాంక్రీట్ జంగిల్‌లా మారి వర్షపు నీరు భూమిలో ఇంకేం దుకు కూడా ఆవకాశం లేకపోవడం, భూగర్భ జలాలు వినియోగించుకోవడమే కానీ, తిరిగి భర్తీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో భూగర్భ జల మట్టాలు భారీగా పడిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో హన్మకొండలో 14.38, జనగామలో 13.77 మీటర్లకు భూగర్భ జలమట్టాలు అడుగంటిపోయాయి. ఇలా జిల్లాలోని పట్టణాల్లో, నగరంలో 13 నుంచి 36 మీటర్ల మేర భూగర్భ జలమట్టం అడుగంటిపోరుుంది.

కాగితాల్లోనే నిషేధం
ప్రభుత్వం 40 మైక్రాన్ల లోపు మందం ఉన్న పాలిథిన్ సంచులను నిషేధించింది. అరుునా నగరంలో పాలిథిన్ వినియోగం ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడ చూసినా పాలిథిన్ సంచుల క్రయవిక్రయాల నియంత్రణకు అధికారులు చేపడుతున్న చర్యలు ఏమీ కనిపించడం లేదు. గతంలో పాలిథిన్ విక్రయాలు అరికట్టేందుకు క్రమం తప్పకుండా దాడులు చేసేవారు. అవి నిలిపివేయడంతో పాలిథిన్ సంచుల విక్రయాలు కొనసాగుతున్నాయి. పాలిథిన్ విని యోగం పెరగడం వల్ల వ్యర్థాలతోపాటు టన్నులకొద్దీ పాలిథిన్ చేరుతోంది. దీంతో భూసారం దెబ్బతినడంతోపాటు డ్రైనేజీల్లో చేరినప్పడు మురుగు పారుదలకు ఆటంకంగా తయారవుతున్నాయి.

వాల్టా చట్టం అమలులో విఫలం
నీరు, భూమి, చెట్టు పరిరక్షణ చట్టం(వాల్టా యాక్టు-2002) అమలులో ఉంది. దీని ప్రకారం వృక్షాలు, చెట్లు నరకకూడదు. ఒకవేళ చెట్లు నరికితే 30 రోజుల్లో ఒక చెట్టుకు రెండు మొక్కల చొప్పన నాటి వాటిని పర్యవేక్షించాల్సి ఉంది. కానీ.. ఇది ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదు.
 ప్రైవేట్ వ్యక్తులే కాదు, విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్నాయని, ఇళ్ల నిర్మాణాలకు, రోడ్ల విస్తరణకు అడ్డుగా వస్తున్నాయని చెట్లను నరికివేస్తున్నారు. నగరంలో విపరీతంగా చెట్లు నరికి వేయడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా ఈ చట్టాలను సక్రమంగా అమలు పరిచే ందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు