నేటి ముఖ్యవార్తలు

9 Mar, 2017 08:41 IST|Sakshi
ఎమ్మెల్సీ ఎన్నికలు
నేడు ఏపీ, తెలంగాణల్లో గ్రాడ్యుయేట్‌, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం, ప్రకాశం, కడపల్లో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ పదవులకు, ప్రకాశం, కడప, మహబూబ్‌నగర్‌లలో టీచర్‌ ఎమ్మెల్సీ పదవులకు నేడు పోలింగ్‌ జరగనుంది.
 
త్రిసభ్య సమావేశం వాయిదా
నేడు గవర్నర్‌ అధ్యక్షతన ఉభయ తెలుగురాష్ట్రాల కమిటీల సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో విభజన సమస్యల గురించి చర్చించాల్సివుంది.
 
టీ-సీఎల్పీ సమావేశం
నేడు మధ్యాహ్నం టీసీఎల్పీ సమావేశం జరగనుంది. దిగ్విజయ్‌సింగ్‌తో పాటు రాష్ట్ర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రానున్న అసెంబ్లీలో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
 
టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం
నేడు టీఆర్‌ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. 
 
రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు
నేటి నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఉజ్జయిని రైలు పేలుడు, యూపీలో ఉగ్రవాది హతం తదితర అంశాలపై రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేయనున్నారు.
 
ఎన్నికలు
దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరగనుంది.
మరిన్ని వార్తలు