కేరళీయుల ఓనం సంబురాలు

7 Sep, 2014 01:19 IST|Sakshi

 బర్థిపూర్(డిచ్‌పల్లి): దేశంలోని వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన ప్రజలతో జిల్లా మినీభారతంగా పేరొందుతోంది. జిల్లాలో స్థిరపడిన, విద్యాఉద్యోగాలరీత్యా వచ్చిన కేరళీయులు ఓనం పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. కేరళ రాష్ట్ర ప్రజలకు అత్యంత ఇష్టమైన ఈ పండుగను జిల్లాలో ఘనంగా నిర్వహించుకున్నారు.

 తిరుమల కళాశాలలో
 డిచ్‌పల్లి మండలం బర్థిపూర్ శివారులోని తిరుమల గ్రూప్ ఆఫ్ ఇన్సిస్టిట్యూట్స్‌లో శనివారం కేరళకు చెందిన విద్యార్థులు తమ సంప్రదాయ ఓనం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక విద్యార్థులతో కలిసి ఆద్యంతం ఆనందోత్సవాలతో పండుగను జరుపుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుతున్న కళాశాలలో ప్రతిఏటా ఓనం పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఓనం సందర్భంగా కళాశాల ఆవరణలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఎదుట రకరకాల పూలతో అందంగా అలంకరించారు. ఇన్సిస్టిట్యూట్స్ కరస్పాండెం ట్ పద్మావతి జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థినులు ప్రదర్శించిన వామనుడు, బలిచక్రవర్తి కథారూపకం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం కేరళ సంప్రదాయ నృత్యాలు, మణిపురి విద్యార్థినుల నృత్యప్రదర్శనలు అలరించాయి.
 
 నేడు అయ్యప్ప ఆలయంలో..
 నిజామాబాద్‌కల్చరల్ : కేరళలోని శబరిమలైలో కొలువైన అయ్యప్పస్వామిని కొలుస్తూ ఆదివా రం జిల్లాకేంద్రంలోని కంఠేశ్వర్‌లోగల అయ్య ప్ప దేవాలయంలో ఓనం వేడుకను నిర్వహించనున్నట్లు గురుస్వాములు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు.

మరిన్ని వార్తలు