అటవీశాఖలో పోస్టుల భర్తీకి...

11 May, 2014 03:01 IST|Sakshi

 ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: అటవీశాఖ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు ఆదివారం నుంచి జరగనున్నాయి. జిల్లా అటవీశాఖలో రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న మొత్తం 254 పోస్టుల (బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, బంగ్లా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్) భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖమ్మం కేంద్రంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. 141 అసిస్టెంట్ బీటాఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం ఖమ్మంలోని 17 కేంద్రాల్లో రాత పరీక్ష ఉంటుంది. దీనికి మొత్తం 13,261 మంది అభ్యర్దులు హాజరుకానున్నారు. ఈ పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది.

ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జన రల్ నాలెడ్జ్ పేపర్; 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమెటిక్స్ పేపర్; మధ్యాహ్నం 1:00 నుంచి 2:30 గంటల వరకు జనరల్ ఎస్సే పరీక్ష ఉంటాయి. ఈ నెల 18న 17 సెంటర్లలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(మొత్తం ఖాళీలు 92) పరీక్ష ఉంటుంది. దీనికి మొత్తం 9,146 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జనరల్ నాలెడ్జ్ పేపర్, 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమేటిక్స్ పేపర్; మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:30 గంటల వరకు పార్ట్-1 జనరల్ ఎస్సే పరీక్ష ఉంటుంది.

 ఈ నెల 25న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (మొత్తం ఖాళీలు 16) పరీక్ష నాలుగు కేంద్రాలలో జరుగుతుంది. మొత్తం 1733 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జనరల్ నాలెడ్జ్ పేపర్; 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమేటిక్స్; మధ్యాహ్నం ఒంటి గంటనుంచి 2:00 గంటల వరకు పార్ట్-1 జనరల్ ఎస్సే పేపర్ పరీక్ష  ఉంటుంది. తానేధార్, బంగ్లా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్ (డీఎం గ్రేడ్-3) పోస్టులకు వరంగల్‌లో పరీక్ష ఉంటుంది.

మరిన్ని వార్తలు