నేడు జడ్‌పీ స్థాయీ సంఘాల ఎన్నికలు

3 Sep, 2014 05:45 IST|Sakshi

 ఇందూరు: జిల్లా పరిషత్ మరోసారి వేడెక్కనుంది. జడ్‌పీ సమావేశ మందిరంలో బుధవారం స్థాయీ సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. పాలకవర్గం కొలుదీరిన 60 రోజుల లో ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆలస్యం జరిగింది. పదవులను ఆశిస్తున్న జడ్‌పీటీసీలు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను ఇప్పటికే కలిసినట్లు తెలి  సింది. 36 జడ్‌పీటీసీలకు గాను 24 స్థానాలను సాధించిన టీఆర్‌ఎస్ జడ్‌పీ పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. స్థాయీ సం ఘాల ఎన్నికలలోనూ ఆ పార్టీ దూసుకుపోనుం ది. మొత్తం ఏడు కమిటీలలో ఎవరెవరు ఉండాలనే విషయంలో మంత్రి పోచారం, ఎంపీ కవిత ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

 ఉదయం 11గంటలకు ఎన్నికలు ప్రారంభం కాగానే, ముందుగా అభ్యర్థుల నుంచి నామినేషన్‌లు స్వీకరిస్తారు. పోటీ లేకపోతే ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు మంత్రి పో చారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్‌పీ చైర్మన్ దఫేదార్ రాజు, నిజామాబాద్ ఎంపీ కవిత, జడ్‌పీ వైస్ చైర్ పర్సన్ గడ్డం సుమనారెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రోస్‌తోపాటు జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్‌పీటీసీ సభ్యులు హాజరుకానున్నారు. 36 మంది జడ్‌పీటీసీలలో కనీసం సగం మంది సభ్యులు కచ్ఛితంగా హాజరైతేనే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణకు జడ్‌పీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సభ్యులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు