దీపక్‌ కిడ్నాప్‌ మిస్టరీ వీడింది!

24 Dec, 2019 13:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కిడ్నాపైన ఏడాదిన్నర బాలుడు దీపక్‌ ఆచూకి లభ్యమైంది. అర్ధరాత్రి బాలున్ని గుర్తి తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. చిలకలగూడ పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో దీపక్‌ను ముగ్గురు మహిళలు కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. కొంతమంది మహిళలు ముఠాగా ఏర్పడి ఇద్దరు చిన్నారులతో కలిసి బాలుడిని కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది.

మౌలాలికి చెందిన రాధిక, తులసీరామ్‌ దంపతులకు నలుగురు సంతానం.. వారు రాము(9), ధనిరాం(6), లక్ష్మణ్‌(4), దీపక్‌ (18 నెలలు). తులసీరామ్‌ ఓ కేసులో జైలులో ఉన్నాడు. డెలివరీ కోసం వచ్చిన బంధువును పరామర్శించేందుకు రాధిక ముగ్గురు పిల్లలతో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలోని విజిటర్స్‌ షెడ్డులోనే ఆమె ఉంటోంది. గత నెల 5న ఉదయం నిద్రలేచి చూడగా దీపక్‌ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఓ ముఠా బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. ముఠాలో ముగ్గురు మహిళలతోపాటు 12 ఏళ్ల బాలుడు, పదేళ్ల బాలిక ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు