తెలంగాణలో రేపు సెలవు

19 Oct, 2015 15:53 IST|Sakshi
తెలంగాణలో రేపు సెలవు

హైదరాబాద్: తెలంగాణ అంతటా మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. సద్దుల బతుకమ్మ వేడుకల కోసం హైదరాబాద్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్బండ్ వరకు బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించనున్నారు.
 

ట్యాంక్బండ్ను అందంగా ముస్తాబుచేశారు. ఎల్ఈడీ లైట్లతో కూడిన బెలూన్లను ఏర్పాటుచేశారు. బతుకమ్మ వేడుకల చివరిలో పటాకులు పేల్చి సంబరాలు జరుపుతారు. ఈ సందర్భంగా ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటుచేసిన బతుకమ్మ ఘాట్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాక్బండ్ వైపునకు వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

మరిన్ని వార్తలు