విత్తనాలు వేసేందుకు తొంద రొద్దు

21 Jun, 2014 04:25 IST|Sakshi
  •      సాగుకు ఇంకా సమయం ఉంది
  •      పత్తికి జూలై రెండోవారం వరకు
  •      వరికి జూలై చివరి వరకు చాన్స్
  •  వరంగల్ : తొలకరి జల్లులు కురవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే భూమిలో కావాల్సినంత పదును ఉంటేనే విత్తనం వేయడానికి అనుకూలంగా ఉంటుందనే విషయం గుర్తిం చాలి. కొందరు రైతులు ఒకటి, రెండు వర్షాలకే తొందరపడి విత్తనాలు వేస్తున్నారు. భూమిలో తగినంత పదును లేకుండా విత్తనాలు వేస్తే నష్టం వాటిల్లుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పత్తి సాగు చేసే రైతులు ఈ జాగ్రత్త పాటించాలని సూచిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో విత్తనాలు నాటేందుకు ఇంకా సమయం ఉందని పేర్కొంటున్నారు.
     
    ఈ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 5,40,450 హె క్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ఇం దులో 2,7500 హెక్టార్లలో పత్తి, లక్షా 60వేల హె క్టార్లలో వరి, 73వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తారని అంచనా వేశారు. ఇప్పటికే రైతు లు 2లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు కొనుగోలు చే శారు. తాజా వర్షాలతో విత్తన దుకాణాలు, పట్ట ణ, మండల కేంద్రాల్లో కొనుగోళ్ల రద్దీ పెరిగింది.
     
    తగినంతగా లేని వర్షపాతం

    జిల్లాలో ఏడాది సగటు వర్షపాతం 993.7 మిల్లీమీటర్లు. జూన్ నెల సగటు వర్షపాతం 137.2 మిల్లీమీటర్లు ఉండగా ఇప్పటి వరకు సీజన్ ప్రారంభమైన తొలి రెండు వారాల్లో రెండు రోజులు మాత్రమే వర్షం కురిసింది. 47 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు ఉంది. గత ఏడాది ఈ సమయానికి ఆరు రోజులు వర్షం కురిసింది. మంగళవారం 46 మండలాలలో వర్షం కురి సిం ది. 24 మండలాల్లో 20 మిల్లీమీటర్లు నమోదైం ది. మొగుళ్లపల్లిలో అత్యధికంగా 64 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో మొత్తం 1102.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూమి పూర్తిగా విత్తనాలు నాటేందుకు అనువుగా మారలేదని వ్యవసాయ అధికారులు అంటున్నారు.
     
    పదునుంటే మొలక వస్తుంది


    విత్తనం నాటేందుకు 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కనీసం జానెడులోతు వరకు భూమి తడిస్తేనే విత్తనాలు వేసేందుకు అనుకూలమని పేర్కొంటున్నారు. లేకుంటే భూమిలోనే విత్తనం మగ్గిపోయి మొలకెత్తకపోయే ప్రమాదం ఉందంటున్నారు. దీని వల్ల రైతులు విత్తన ఖర్చుతోపాటు, అచ్చు చేసేందుకు అవసరమైన శ్రమను కూడా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు. నీటి వనరులు అందుబాటులో ఉంటే విత్తనాలు నాటుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేస్తున్నారు. వర్షాధారంపై సాగు చేసే రైతులు మాత్రం తగిన జాగ్రత్త తీసుకోకుంటే ఆర్థికంగా నష్టపోతారని పేర్కొంటున్నారు.

    మట్టిపాలైన విత్తనం

    మే నెలలో కురిసిన వర్షానికితోడు, నీటి వనరు లు అందుబాటులో ఉన్నాయని ఆత్మకూరు, దు గ్గొండి, సంగెం తదితర ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటారు. మొన్నటి వరకు తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాలులతో భూమిలోని విత్తనం మొలకెత్తని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు ఇప్పుడు తలలుపట్టుకుంటున్నారు. తాజాగా కురిసిన ఒక వర్షానికి పదునులేకుండా విత్తనాలు వేయకూడదని హెచ్చరిస్తున్నారు.
     
    భూమి బలంపెంచుకోవాలి

    ఈ వర్షాలను అనువుగా తీసుకొని దుక్కులు సి ద్ధం చేసుకుని, అచ్చు చేసుకోవాలని సూచిస్తున్నారు. భూసార పరీక్షలు నిర్వహించుకొని అనువైన పంటను ఎంచుకోవాలని చెబుతున్నారు. భూమిలో బలంపెంచేందుకు అవసరమైన సేం ద్రియ ఎరువులు, దుక్కి ఎరువులు, పెంట మట్టి ఇతర వాటిని వినియోగించేందుకు ఈ సమయా న్ని వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
     
     తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
     చిన్న వర్షాలకే విత్తనాలు నాటితే నష్టం వాటిల్లుతుంది. విత్తనాలు నాటేందుకు ఇంకా సమయం ఉంది. ముఖ్యం గా పత్తి విత్తనాలు జూలై రెండో వారం వరకు, వరినాట్లు జూలై చివరి వరకు వేసుకోవచ్చు. రానున్న రోజుల్లో మంచి వర్షాలు కురుస్తాయని భావిస్తున్నాం. వాతావరణశాఖ ఇదే విషయాన్ని చెబుతోంది. వర్షాలు రాకుంటే స్వల్పకాలిక పంటలు వేసుకునే దిశగా సాగాల్సి ఉంటుంది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  
     -రామారావు, జేడీఏ
     
     దుక్కులు సిద్ధం చేసుకోవాలి
     వర్షపాతం 70 మిల్లీమీటర్లు నమోదయ్యాక విత్తనాలు నాటొచ్చు. ప్రస్తుతం దుక్కులు సిద్ధం చేసుకోవాలి. భూసారాన్ని పెంచేందుకు అవసమరైన జాగ్రత్తలు తీసుకోవాలి. పచ్చిరొట్ట, పెంట, చెరువుమన్నుతో పంటకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ దిశగా రైతులు సాగాలి. నీటి వనరులున్న రైతులు విత్తనాలు నాటుకోవచ్చు.
     - డాక్టర్ ఉమారెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త
     

మరిన్ని వార్తలు