బాధ్యతలు స్వీకరించిన కొప్పుల

20 Dec, 2014 02:10 IST|Sakshi

 హాజరైన ఈటెల, నాయకులు
 కరీంనగర్ సిటీ/ధర్మపురి: చీఫ్‌విప్‌గా నియమితులైన ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ శుక్రవారం పదవీబాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీలో తనకు కేటాయించిన కార్యాలయంలో ఉదయం ఈశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, కోరుట్ల, మంథనిఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులు హాజరై కొప్పులను అభినందించారు.
 
 మంత్రి పదవిని ఆశించిన కొప్పుల చీఫ్‌విప్ పదవిని ముందుగా నిరాకరించడం తెలిసిందే. ఆయన పదవీబాధ్యతలు చేపట్టకపోవడంతో టీఆర్‌ఎస్‌లో ఒకింత ఉత్కంఠ నెలకొంది. చివరకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసిన తరువాత కొప్పుల చీఫ్‌విప్‌గా కొనసాగడానికే మొగ్గుచూపారు. ముహూర్తం ప్రకారం శుక్రవారం తన కార్యాలయంలో పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గం నుంచి టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కొప్పుల ఈశ్వర్ సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వర్షం కోసం చూసే రోజులు పోతాయి: హరీష్‌రావు

అంతు చిక్కని భూముల లెక్కలు

ఇక పంచాయతీల్లో పారదర్శకం 

యువకుడిది హత్యా.. ప్రమాదమా?

మారథాన్‌ రన్‌తో సిటీలో ట్రాఫిక్‌ కష్టాలు

పోటాపోటీగా సభ్యత్వం

హైకోర్టు న్యాయమూర్తిగా బోగారం వాసి 

రాజకీయ అండతో పెద్దలే.. గద్దలై!     

ఒకేసారి తప్పిన పెను ప్రమాదాలు

పాపం ఎద్దులు బెదరడంతో..  

ఖమ్మంలో బాలుడి హత్య..!

రేక్‌ పాయింట్‌ వచ్చేనా?

‘మార్గదర్శక్‌’తో ఆమెకు అభయం   

సాహసయాత్రకు పునాదులు హైదరాబాద్‌లోనే.. 

ఐదుగురు మావోల ఎన్‌కౌంటర్‌

హైదరాబాద్‌ సిటీలో ఆకుపచ్చ ఫ్రిడ్జ్‌లు!

శాంతిభద్రతలతోనే ఆర్థిక వృద్ధి

అద్భుత స్తూపం... అందులో 'గీత'

పండుగకు ముందే బతుకమ్మ చీరలు

బీజేపీ దూకుడుపై తర్జనభర్జన

మిస్డ్‌కాల్‌ సభ్యత్వాలకే సంబరాలా?

కేంద్రమే నిర్వహిస్తుందా?

డెంగీపై జర పైలం

కాంగ్రెస్‌ వరుస పాదయాత్రలు

డాక్టర్, ఇంజనీర్‌ అయినా సంతృప్తి చెందని యువత

24x7 మీ సేవలో..

ఓవరైతే.. డేంజర్‌ !

ఇక దృష్టంతా దక్షిణంపైనే

ఈనాటి ముఖ్యాంశాలు

జైట్లీ సేవలు చిరస్మరణీయం: లక్ష్మణ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పొలిటికల్ సెటైర్ గా ‘జోహార్’ 

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

‘నాకూ గంజాయి అలవాటు ఉండేది’

పాడుతా తీయగా అంటున్న నటి

‘గ్లామరస్‌గా కనిపిస్తే తప్పేంటి?’

ఆసక్తికరంగా ‘రాహు’ టీజర్‌