పాలన పట్టదా ?

4 Jan, 2015 04:16 IST|Sakshi
పాలన పట్టదా ?

ఇద్దరు కేబినెట్ మంత్రులు. మరో ముగ్గురు అదేస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు. మండల పరిషత్‌లు మొదలుకుని జిల్లా, రాష్ట్రస్థాయిలోనూ వారిదే అధికారం. కానీ జిల్లాకు సంబంధించిన కీలక సమీక్షల్లో కనిపించరు. ఎన్నికై నెలలు గడుస్తున్నా ఏనాడూ పాలనాపరమైన సమీక్షల్లో పాల్గొనరు. వచ్చినా మొక్కుబడి హాజరుకే పరిమితం. ఇలాగైతే పాలన పట్టాలెక్కేదెట్ల్లా..? సమస్యలు పరిష్కారమయ్యేదెలా..?
 
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సుమారు ఏడాది తర్వాత శనివారం జరిగిన విజిలెన్స్ అండ్ మాని టరింగ్ కమిటీ సమావేశం మొక్కుబడిగా సాగింది. నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీకి మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి కో చైర్మన్.

కేంద్రం నిధులతో జిల్లాలో అమలయ్యే వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించడం ఈ సమావేశం లక్ష్యం. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గృహ నిర్మాణం, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం వంటి కీలక ప్రభుత్వ శాఖల పరిధిలో అమలయ్యే వివిధ ప్రభుత్వ పథకాలను ప్రతి మూడు నెలలకోమారు సమీక్షించడం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ బాధ్యత.

రాష్ట్ర విభజన, ఎన్నికలు, కమిటీ నూతన చైర్మన్ నియామకం తదితర కారణాలతో సమీక్ష సమావేశం సుమారు ఏడాది కాలంగా వా యిదా పడుతూ వస్తోంది. ఇటీవల పార్లమెంటు సమావేశాలు ముగియడంతో ఎట్టకేలకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహణకు ముహూర్తం కు దిరింది.

అయితే ఈ సమావేశానికి అధికార పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మినహా మిగతా ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. కమిటీ ఛైర్మన్ నంది ఎల్లయ్యతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్ పాల్గొన్నా రు.

అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎ మ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో సుమారు ఆరు గంటల పాటు సాగాల్సిన సమావేశం గంటన్నర వ్యవధిలో ముగిసింది. ఎజెండా అంశాలు అన్నింటినీ స్పృషించకుండానే మొ క్కుబడిగా సమీక్ష జరిగింది. మంత్రులు లేనప్పుడు తాము వివిధ అంశాలను లేవనెత్తినా ప్రయోజనం ఏముందంటూ విపక్ష సభ్యులు అసహనం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని ముగించారు.
 
సంపూర్ణ సమీక్షలేవీ..?
నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచినా జిల్లాలో నెలకొన్న వివిధ సమస్యలపై నేటికీ విభాగాల వారీగా సంపూర్ణ సమీక్షలు జరగడం లేదు. జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశాలు ఇటీవలి కాలంలో రాజకీయ ప్రసంగాలతో పార్టీల నడుమ ఆధిపత్య పోరుకు వేదికగా మారాయి. ఇన్నాళ్లూ జిల్లా నుంచి మంత్రి మండలిలో ప్రాతినిధ్యం లేకపోవడం, ఇన్‌చార్జి మంత్రులు లేకపోవడంతో అధికారులపైనే ఆధారపడి పాలన సాగుతోంది.

కరువు, వలసలు, రైతు ఆత్మహత్యలు, మార్కెటింగ్ సమస్యలు, సామాజిక పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు, సాగు, తాగునీటి ప థకాల పనుల్లో ఆలస్యం, ఇళ్ల నిర్మాణ బిల్లుల పెం డింగు, అక్రమ ఇసుక రవాణా ఇలా సమస్యల జా బితా చాంతాడును తలపిస్తోంది. మరోవైపు జిల్లా క లెక్టర్, జాయింట్ కలెక్టర్, వివిధ విభాగాల సిబ్బంది నడుమ సమన్వయ లోపం కూడా పాలనపై ప్ర భావం చూపుతోంది.

ప్రభుత్వం నుంచే తక్షణ ఆదేశాల అమలుపై సంబంధిత విభాగాల అధికారులు కొద్ది రోజులు ఉరుకులు, పరుగులు పెడుతూ హడావుడి చూపిస్తున్నారు. కానీ వివిధ విభాగాల పని తీరును క్రమం తప్పకుండా సమీక్షించడంలో జిల్లా కలెక్టర్ చొరవ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

అధికారులు, సిబ్బందిని విశ్వాసంలోకి తీసుకోకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే అదునుగా అధికారులు కూడా మొక్కుబడి నివేదికలతో సమావేశాలకు వస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాలన యంత్రాంగం తీరుపై దృష్టి సారించక పోవడంతో సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. దీంతో పాలనను పట్టాలెక్కించే నాథుడి కోసం జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు.

>
మరిన్ని వార్తలు