టఫ్‌ వన్‌ బాస్‌ అంటున్న కేటీఆర్‌..!

10 Mar, 2018 13:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఐటీ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. తనను ఉద్దేశించి.. తనను ట్యాగ్‌ చేసి ఎవరు ట్వీట్‌ చేసినా.. చాలావరకు బదులు ఇస్తుంటారు. దీంతో రోజురోజుకు ఆయన ట్విటర్‌ ఖాతాకు విజ్ఞాపనలు, ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. చాలామంది తన సాయం కోసం చేస్తున్న ట్వీట్లకు కేటీఆర్‌ కూడా బదులిస్తున్నారు.

తాజాగా కేటీఆర్‌ దృష్టికి ఒక ఆసక్తికరమైన ట్వీట్‌ వచ్చింది. దానిని రీట్వీట్‌ చేస్తూ.. ‘టఫ్‌ వన్‌ (కష్టమైంది) బాస్‌’ అంటూ బదులిచ్చారు. ఇంతకీ ఆ ట్వీట్‌ ఏమిటంటే..‘కేటీఆర్‌ సార్‌.. నేను శాకాహారిని. నేను ఇడ్లీ, దోసా, అన్నం.. ఇలా ఏదీ తిన్నా జీఎస్టీ కట్టాల్సి వస్తోంది. మా బోడుప్పల్‌లో హోటళ్లు రాత్రి 10 గంటలవరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. ఇక నా స్నేహితుడు హైదరాబాద్‌ పాతస్తీలో నాన్‌ వెజ్‌ తింటాడు. బిర్యానీ తిన్నా, రోటీ తిన్నా జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. హోటళ్లు 24 గంటలూ తెరిచి ఉంటాయి.. నాయ్యం చేయండి సార్‌’ అంటూ ఎంబీ ప్రకాశ్‌ చేసిన ట్వీట్‌కు కష్టమే బాస్‌ కేటీఆర్‌ బదులిచ్చారు.

మరిన్ని వార్తలు