పర్యాటక శోభ

21 Aug, 2015 01:43 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
 సహజసిద్ధమైన ప్రకృతి అందాలకు.. చారిత్రక కట్టడాలకు నెలవుగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు ఇక పర్యాటకశోభ సంతరిం చుకోనుంది. జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను అన్నిరకాలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం రూ.99.86కోట్లు  కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఎకో టూరిజం సర్క్క్యూట్‌గా స్వదేశ్ దర్శన్ మిషన్ పేరుతో జిల్లాలోని పలు ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి పర్యాటక రంగానికి వన్నె తెచ్చేందుకు సంకల్పించింది. జిల్లాలోని ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని స్వదేశ్ దర్శన్ మిషన్ డెరైక్టరేట్ కమిటీ ఈ నెల 19న ఢిల్లీలో సమావేశమై ఈ మేరకు
 నిర్ణయం తీసుకొంది.
 
 తెలంగాణ పర్యాట క సంస్థ ప్రతిపాదనల మేరకు పర్యాటకులను అన్నిరకాలుగా ఆకర్షించేందుకు అ నువైన ప్రదేశాలు ఎంపిక చేసి వాటిలో ప ర్యాటకులకు కావాల్సిన సకల సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. కొ ల్లాపూర్ సమీపంలోని సోమశిల నదికి స మీపంలో ప్రకృతి అందాలను పర్యాటకులను అక్కడ సకల సదుపాయాలు కల్పిం చాలని అలాగే బోటింగ్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దీనికోసం రూ. 12.72కోట్లు కేటాయించింది. అలాగే కొ ల్లాపూర్ సమీపంలోని సింగోటం రిజర్వాయర్‌గా ఉన్న శ్రీవారి సముద్రం చెరువు ను పర్యాటకుల కంటికింపు కలిగే విధం గా తీర్చిదిద్దడానికి రూ.10.12 కోట్లు కేటాయించింది. శ్రీశైలంకు సమీపంలో తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న అక్క మహాదేవి ప్రాంతాన్ని రూ.6.27 కోట్లతో పర్యాటకులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది.
 
 అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఉమామహేశ్వరం ప్రాంతా న్ని బేస్ క్యాంప్ సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు రూ.18.12కోట్లు కేటాయిం చింది. వీటితో అక్కడ ట్రెక్కింగ్ పర్యాటకుల కోసం నడకదారులు ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. అలాగే అచ్చంపేట నియోజకవర్గంలోని ఫరహాబాద్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అక్కడ సైక్లింగ్, ట్రెక్కింగ్, పర్యాటకులు నివాసముండేందుకు వసతులను ఏర్పాటుచేసేందుకు రూ.12.47 కోట్లను మంజూరు చేసింది. అలాగే మల్లెలతీర్థానికి రూ.14.89 కోట్లను మంజూరు చేసింది. ఈగల పెంటలో ఓపెన్‌ఎయిర్ థియేటర్ నిర్మాణానికి సుమారు రూ.15.94 కోట్లు మంజూరు చేసింది. దీంతో జిల్లాలో పర్యాటకరంగం దశ తిరిగే అవకాశం ఉంది.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా