కిన్నెరసానిలో పర్యాటకుల కోలాహలం

18 Jun, 2018 13:25 IST|Sakshi
కిన్నెరసాని డ్యామ్‌ మీదనుంచి దిగువకు వెళ్తున్న పర్యాటకులు  

ఒక్క రోజు ఆదాయం రూ.52 వేలు 

పాల్వంచరూరల్‌ : కిన్నెరసానిలో పర్యాటకుల కోలాహలం కన్పించింది.ఆదివారం ఒక్కరోజు ఆదాయం అరలక్ష పైనా లభించింది.  పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానికి పర్యాటకుల తాకిడి నానాటికి పెరుగుతుంది.  సెలవు రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో కిన్నెరసాని పరిసరాలు పర్యాటకులు సందడి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సవాల నడుమ గడిపారు.

డీర్‌ పార్కులోని చుక్కల దుప్పులను, నెమళ్లను వీక్షించిన పర్యాటకులు డ్యామ్‌ మీదకు వెళ్లి రిజర్వాయర్‌లోని నీటి మట్టాన్ని వీక్షించారు. బోటు షికారు చేశారు. 1100 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్‌శాఖకు రూ.28 వేల ఆదాయం రాగా, 500 మంది బోటు షికారు చేయడంతో రూ.24వేల ఆదాయం  లభించినట్లు నిర్వహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు