సాతేల్లిబేస్ కాలనీలో విషజ్వరాలు

10 Oct, 2014 01:41 IST|Sakshi

నిజాంసాగర్ :  మండలంలోని ముగ్దుంపూర్  గ్రామ సాతేల్లిబేస్ కాలనీలో ప్రజలు విషజ్వరాలతో విలవిలాడుతున్నారు. తీవ్రమైన జ్వరం, కాళ్లు, కీళ్లనొప్పులతో రోగులు మంచం పట్టారు. చీమన్‌పల్లి గంగవ్వ, రుక్మాబాయి, అవుసుల రామవ్వ, ఆదం నాగమణి, ఆదం గంగమణి, సాతేల్లి సత్యవ్వ, ఆదం సువ ర్ణ, అల్లదుర్గం లక్ష్మితోపాటు మరికొంత మంది విషజ్వరాలబారిన పడ్డారు. వీరంతా స్థానికంగా ఉన్న ప్రయివేటు వైద్యులతో చికిత్స చేయించుకుంటున్నారు.

15 రోజులుగా విషజ్వరాలు వేధిస్తున్నా వైద్యశాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేల రూపాయలు ఖర్చు చేస్తున్నా జ్వరాలు నయం కావడం లేదని వాపోతున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న కొందరు బాన్సువాడలోని ప్రభుత్వ, ప్రయివేలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు